రోజుకు ఎన్ని అరటిపండ్లు తినొచ్చు.. అతిగా తింటే వచ్చే సమస్యలు ఏంటి?
అరటి పండు అనేద ఇన్స్టంట్ ఫుడ్. శరీరంలో తొందరగా జీర్ణమయి వెంటనే శక్తిని అందజేస్తుంది. అందుకే మనకు ఏ టైంలోనైనా భోజనం అందుబాటులో లేనపడు రెండు అరటి పండ్లు తింటే ఆకలి తీర్చుకుంటారు. ఇది సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. అరటి పండులో చాలా పోషకాలుంటాయి. ముఖ్యంగా B6, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. మెగ్నిషియం, పొటాషియం మాంగనీస్, ఫైబర్ లు అరటి పండులో మెండుగా ఉంటాయి. అరటి పండును మితంగా తింటే నష్టమేమీ ఉండదు. రోజుకి రెండు లేదా మూడు పండ్లు తింటే సమస్య ఉండదని డాక్టర్లు చెబుతారు.
అతిగా తింటే వచ్చే సమస్యలు
బనానా పండును ఎక్కువ మోతాదులో తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అరటి పండు ఎక్కువగా తినేవాళ్లలో మలబద్దక సమస్య ఏర్పడే చాన్స్ ఉంటుందంటున్నారు. రెగ్యులర్గా బనానా ఎక్కవ మొతాదులో తింటే అందులో ఉండే కొన్ని రసాయనాలు మైగ్రేన్ని ప్రేరేపిస్తాయి.
Also Read : చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయా..? అయితే, జాగ్రత్త పడాల్సిందే..!
ఇక డయాబెటిక్(సుగర్) ఉన్నవారు అరటి పండ్లను తినొద్దు. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ రక్తంలో చెక్కర స్థాయిలను పెంచుతుంది. చెక్కెర స్థాయిలు పెరిగితే దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు వీటి జోలికి పోకపోతేనే మంచిది. నార్మల్ లెవెల్స్ మెయింటేన్ చేసేవారు ఎక్కవగా పండని, దోరగా ఉన్న పండును ఉదయం సగం, సాయంత్రం సగం తినొచ్చు.
Also Read : ఆన్సర్లేని క్యాన్సర్.. ప్రారంభ దశలో గుర్తిస్తేనే మంచి ఫలితం
అరటి పండు ఎక్కువగా తినేవారిలో దంత క్షయం( అరుగుదల) ఏర్పడుంది. బనానా ఎక్కువ తింటే బరువు కూడా తొందరగా పెరుగుతారు. శరీరంలో పొటాషియం నిల్వలు పెరిగి హైపర్ కలేమియాని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల కడుపులో గ్యాస్ పడుతుంది. కడుపుబ్బరంగా అనిపిస్తుంది. టైరోసిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో టైరమైన్గా మారుతుంది. ఇది మైగ్రేన్ను ప్రేరేపిస్తుంది. ఆస్తమా ఉన్నవారు అరటిపండ్లను పరిమితంగా తినాలి. అరటి పండే కాదు ఏ పండైనా, ఆహారమైనా మనకు సరిపోయినంత తింటే సమస్యలేదు. నోటికి రుచిగా ఉందని మొతాదుకు మించి తింటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

