Cramps in legs | చేతులు, కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తున్నాయా..? అయితే, జాగ్రత్త పడాల్సిందే..!
Cramps in legs | అరికాలు, అరచేతిలో కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. ఇది అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. తరచుగా జరుగుతుంటే మాత్రం...
Cramps in legs | మనం కింద కూర్చోగానే కొద్దిసేపటికి కాళ్లు తిమ్మిర్లు పడుతుండటం చూస్తుంటాం. తల కింద చేయి పెట్టుకుని పడుకున్న సమయాల్లో కూడా చేతుల్లో తిమ్మిర్లు కనిపిస్తుంటాయి. ఇలా జరగడానికి ముఖ్య కారణం.. రక్తం సరఫరాలో అడ్డంకులు ఏర్పడటమే. అలాకాకుండా కొన్ని సమయాల్లో కూడా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఎందుకలా జరుగుతుందో.. నిర్లక్ష్యం చేస్తే ఎంతగా ఇబ్బంది పడాల్సి వస్తుందో తెల్సుకుందాం.
ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లు తిమ్మిరెక్కుతాయి. అలాగే అరికాలు, అరచేతిలో కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. ఇది అందరినీ ఏదో ఓ సందర్భంలో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే, ఇలాంటి ఇబ్బంది అప్పుడప్పుడు జరిగితే పెద్ద నష్టం లేదు. కానీ, తరచుగా జరుగుతుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు వైద్యులు.
ఈ సమస్య లక్షణం మూలాల్లోకి వెళ్లకుండా తిమ్మిర్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిరిగి కోలుకోలేనంతగా నరాలు దెబ్బతిని వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిమ్మిర్లు వారాల తరబడి వేధిస్తూ క్రమంగా తీవ్రమవుతూ ఉంటే మాత్రం ఇలాంటి వాటిని శరీరంలోని తీవ్రమైన వ్యాధులకు సంకేతాలుగా భావించాలి.
రక్తంలో అధిక చక్కెర కారణంగా నరాలు దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్ళు తిమ్మిరికి గురవుతాయి. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు వచ్చే అదనపు ద్రవాలు శరీరంలోని నరాలపై నొక్కడం వలన కూడా తిమ్మిర్లు వస్తాయి. చర్మం వదులుగా మారి బొడ్డు ప్రాంతంలో కూడాతిమ్మిరి వస్తుంది. ప్రసవించిన తర్వాత కూడా తిమ్మిర్లు అలాగే ఉంటే చికిత్స పొందాలి. వెన్నెముకలో జారిన డిస్క్ కాళ్ల కిందకు వెళ్లే నరాలపై ఒత్తిడిని కలిగించి తిమ్మిర్లకు కారణమవుతుంది. ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థరైటీస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి.
మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బీ లేదా ఈ విటమిన్ లోపించినప్పుడు అది నరాలపై ప్రభావం చూపి తిమ్మిర్లు వచ్చేలా చేస్తాయి. క్యాన్సర్ , హెచ్ఐవీ, అధికరక్తపోటు, టీబీ వంటి వ్యాధులను తగ్గించుకునేందుకు వాడే మందులు కూడా తిమ్మిర్లు వచ్చేలా చేస్తాయి. అదేవిధంగా హెపటైటీస్ బీ, సీ, లైమ్ డిసీజ్ వంటి కొన్నిరకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నరాలను దెబ్బతీయడం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమవుతాయి.
మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోయినట్లయితే కూడా తిమ్మిర్లు కనిపిస్తాయి. జన్యుపరమైన రుగ్మత వల్ల కూడా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. నరాలపై ట్యూమర్లు పెరుగుతున్న సందర్భాల్లో, థైరాయిడ్ సమస్యతో ఉన్నవారిలో, అలాగే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో కూడా తిమ్మిర్లు కనిపిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణ కు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

