ఆన్సర్‌లేని క్యాన్సర్.. ప్రారంభ దశలో గుర్తిస్తేనే మంచి ఫలితం
వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు వస్తున్నప్పటికీ.. కొన్ని వ్యాధులకు మాత్రం కచ్చితమైన పరిష్కారం లభించడం లేదు. అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో జీవితకాలాన్ని పెంచుకోగలుగుతున్న మానవుడు, క్యాన్సర్‌కు మాత్రం ఆన్సర్ తెలుసుకోలేక పోతున్నాడు. ఎన్ని మందులు వచ్చినా, ఎన్ని కొత్త కొత్త చికిత్సలు వచ్చినా.. క్యాన్సర్ వ్యాధిపై ఎక్కడో ఒక దగ్గర ప్రజల్లో అవగాహన కొరవడిందని చెప్పవచ్చు. అందుకే ‘క్యాన్సర్’ అనే పదం వినగానే గుండెలో రైలు పరుగెత్తుతుంది. క్యాన్సర్ వ్యాధులపై ఎన్నో సందేహాలు, ఎన్నెన్నో భయాలు మనిషిని నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. తొలిదశలోనే గుర్తిస్తే ఎన్నో క్యాన్సర్లను జయించవచ్చు!
క్యాన్సర్ అంటే..
సాధారణంగా ప్రతి మనిషి శరీరంలో కణాల విభజన అనేది సమతుల్యంగా జరగాలి. వయసు పెరిగేకొద్దీ పాత కణాలు నశిస్తూ, కొత్త కణాలు జనించాలి. అలాకాకుండా కణాల విభజన అసంబద్ధంగా జరగడం వల్ల కొన్ని కణాలు పెరుగుతూ పోతాయి. ఇవి నశించకుండా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఇలా అసంబద్ధంగా జరిగే కణాల విభజన వల్ల ఏర్పడే కణుతులనే క్యాన్సర్‌గా పేర్కొంటారు. క్యాన్సర్ వ్యాధులు శరీరంలో ఏ అవయవానికైనా, ఏ వయసువారికైనా సోకవచ్చు. వీటిలో అనేక రకాలున్నాయి. అయితే, చాలా క్యాన్సర్లకు కచ్చితమైన కారణాలు చెప్పలేం. కొన్ని రకాల క్యాన్సర్లు జన్యుపరంగా వస్తే.. మరికొన్ని జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది.
ముందే గుర్తించవచ్చు..
ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందా అని మొత్తంగా తెలుసుకునే పరీక్షలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, ఏదైనా ఒక అవయవానికి వ్యాధి సోకినట్లు అనుమానం ఉంటే ఆ అవయవానికి సంబంధించిన వైద్యపరీక్షల ద్వారా వ్యాధి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. వ్యాధి వచ్చిన ప్రదేశం ఆధారంగా వేర్వేరు నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి బయాప్సీ, ఎఫ్.ఎన్.ఎ. టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ-స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ వంటి పరీక్షల ద్వారా వ్యాధితోపాటు దాని తీవ్రతను తెలుసుకోవచ్చు. అయితే మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్ పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించే వీలుంది.
క్యాన్సర్ వ్యాధుల లక్షణాలు :
వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా క్యాన్సర్ లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి రెండో, మూడో దశకు చేరుకున్న తరువాత అంటే.. దాదాపు రోగం ముదిరిన తరువాతే లక్షణాలు బయట పడతాయి. ప్రధానంగా అలసట, జ్వరం, వాంతులు, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఆకలి మందగించడం, విరేచనాలు, రక్తహీనత మొదలైనవి క్యాన్సర్ వ్యాధుల సాధారణ లక్షణాలు.
ఆ క్యాన్సర్లకు టీకా..
వ్యాధికి కచ్చితమైన కారణం తెలిస్తే అది రాకుండా టీకాలు తీసుకోవచ్చు. కానీ, చాలారకాల క్యాన్సర్లకు కచ్చితమైన కారణం తెలియదు. అందుకే ఈ వ్యాధులకు ఎలాంటి టీకాలూ లేవు. కానీ, కొన్నిరకాల క్యాన్సర్లకు టీకాలు ఉన్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హెచ్.వి.పి. వైరస్ వల్ల వస్తుందని తెలియడంతో ఈ వైరస్ సోకకుండా ముందస్తుగా టీకా వేసుకోవచ్చు. 9 ఏళ్ల వయసు బాలికల నుంచి శృంగార జీవితం ప్రారంభం కాని మహిళల వరకూ ఈ టీకా వేయవచ్చు. హెచ్.వి.పి. టీకా వల్ల అండాశయం, గొంతు క్యాన్సర్లు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
ఈ నియమాలు పాటిస్తే..
కచ్చితమైన కారణాలు తెలియదు కాబట్టి, క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదని చెప్పాలి. అయితే క్యాన్సర్ దరిచేరకుండా కొంతవరకు ప్రయత్నించవచ్చు. అందుకోసం మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిని మార్చుకోవాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మద్యపానం, ధూమపానంతోపాటు కాలుష్యానికీ దూరంగా ఉండాలి.
చికిత్సా పద్ధతులు..
క్యాన్సర్ చికిత్సల్లో దుష్ప్రభావాలు ఎక్కువ. ప్రస్తుతం వీటిని కూడా తగ్గించే పద్ధతులు, ఔషధాలు అందు
బాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు అన్ని సౌకర్యాలు ఉండి, అనుభవజ్ఞులైన వైద్యులున్న దవాఖానలో చేరడం ఉత్తమం. క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడంతోపాటు యోగా, ధ్యానం చేయాలి. ఇవి రోగి చికిత్సకు బూస్టర్‌గా పనిచేస్తాయి. పౌష్టిక ఆహారం తీసుకోవాలి. క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో కీ-హోల్ సర్జరీలు, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, కీమో, రేడియో థెరపీ ప్రధానమైనవి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98480 11421
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Cancer
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

