Sweet Corn | స్వీట్ కార్న్‌తో స్వీట్ హెల్త్.. ఎలాగో తెలుసా..?
Sweet Corn | స్వీట్ కార్న్..! స్వీట్ కార్న్ అంటే తియ్యటి మక్కజొన్నలు. కాలాలతో సంబంధం లేకుండా ఏడాదిలోని అన్ని సీజన్లలో ఈ తియ్యటి మక్కజొన్నలు లభిస్తాయి. ఈ మక్కజొన్నలను
హైదరాబాద్: స్వీట్ కార్న్..! స్వీట్ కార్న్ అంటే తియ్యటి మక్కజొన్నలు. కాలాలతో సంబంధం లేకుండా ఏడాదిలోని అన్ని సీజన్లలో ఈ తియ్యటి మక్కజొన్నలు లభిస్తాయి. ఈ మక్కజొన్నలను పచ్చివిగా తిన్నా, ఉడకబెట్టుకుని తిన్నా, ఇతర పదార్థాలతో కలిపి వండుకుని తిన్నా రుచిగా ఉంటాయి. రుచికి మాత్రమే కాదు, ఈ మక్కజొన్నలతో తయారు చేసుకునే పదార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మరి ఈ తియ్యటి మక్కజొన్నలతో కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..?
ఆరోగ్య ప్రయోజనాలు..
1. తియ్యటి మక్కజొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
2. ఇక స్వీట్‌కార్న్ అంటేనే ఫైబర్‌కు చిరునామాగా చెప్పవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ మంచి పరిష్కారమని చెప్పవచ్చు.
3. స్వీట్‌కార్న్‌లలో ఉండే విటమిన్-సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి-12, ఐరన్, ఫోలిక్ యాసిడ్లు రక్తహీనతకు చెక్ పెడుతాయి.
4. అదేవిధంగా తియ్యటి మక్కజొన్నల్లోని ఫాస్ఫరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయి.
5. నిత్యం ఒత్తిళ్లలో పనిచేసే వారికి స్వీట్ కార్న్ మంచి మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫినోలిక్ ఫైటో కెమికల్స్ హైపర్ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి.
6. స్వీట్ కార్న్‌లు చాలా వేగంగా జీర్ణమవుతాయి. అందువల్ల శరీరానికి తక్షణమే కావాల్సినంత శక్తి వస్తుంది. అందువల్ల స్వీట్‌కార్న్‌ను ప్రతిరోజూ కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

