Tea | నాటి నుంచి నేటి దాకా పెళ్లిచూపుల్లో ఎవర్గ్రీన్ ‘టీ’
Tea | ట్రేలో ఫలానా రంగు కప్పు తీసుకుంటే అమ్మాయి నచ్చినట్టని, కప్పు నేరుగా అబ్బాయి చేతికి అందిస్తే అమ్మాయికి సమ్మతమని ఇలా రకరకాల కోడ్ భాషలను కాబోయే వధూవరులకు రహస్యంగా ఉపదేశిస్తారు.
Tea | ఈ రోజుల్లో పెండ్లిచూపుల భేటీలు గరిష్ఠంగా బరిస్తా వంటి కాఫీ షాపుల్లో జరుగుతున్నాయి కానీ, నిన్నమొన్నటి వరకు నాలుగు గోడల మధ్యే ఈ తంతు ముగిసేది! ఇప్పటికీ చాలామంది ఇంటిపట్టునే కానిచ్చేస్తున్నారనుకోండి. తరాలు మారినా.. చాయ్ లేని పెండ్లిచూపులు చప్పగా సాగుతాయి. కాబోయే వధూవరుల తొలి చూపులు కలిసే శుభఘడియకు ప్రత్యక్ష సాక్షి టీ. చక్కని చుక్క వయ్యారాలు ఒలకబోస్తూ అబ్బాయికి టీ చుక్క అందించే సన్నివేశం పండంటి కాపురానికి నాంది! ఈ సందర్భంగా టీ ఇచ్చిపుచ్చుకునే క్రమంలో ఉభయుల మునివేళ్లూ లీలగా తాకాయా తేనీటి కప్పులో కాముడి తుఫాన్ మొదలవుతుంది.
మొహమాటంతో చేతులు చప్పున వెనక్కి తీసుకునే క్రమంలో.. కప్పు కాస్తా దొర్లి అబ్బాయి కొత్త చొక్కాపై మరపురాని మరకను ముద్రించేస్తుంది. ఒకవేళ సాదాసీదాగా గ్లాస్ అందుకున్నా అక్కడితో ప్రహసనం ముగిసిపోదు! అమ్మాయిని మళ్లీ చూడాలనే వంకతో.. ‘చక్కెర తక్కువైంద’నీ, ‘ఎక్కువైంద’నీ, ‘టీ చల్లారింద’నీ ఇలా నానావంకలతో పిల్లవంక ఏ శంకా లేకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు అబ్బాయి! అతగాడి చేష్టలన్నీ గమనించిన కోమలి.. అప్పుడే తనపై మనసు పారేసుకున్నాడని లోలోపల మురిసి పోతుంది.
పెద్దలున్నారని కొంచెం బింకం నటించినా, ఆమె బుగ్గమీద మొగ్గవేసిన సిగ్గును కనిపెట్టిన పెద్ద ముత్తయిదువలు పెండ్లిచూపుల అంకాన్ని మరింత రక్తికట్టిస్తారు. తేనీటి సందడిలోనే ఇరువురి అంగీకారం తెలుసుకునే విధంగా రాయబారాలు నెరిపే తుంటరులూ ఉంటారు. ట్రేలో ఫలానా రంగు కప్పు తీసుకుంటే అమ్మాయి నచ్చినట్టని, కప్పు నేరుగా అబ్బాయి చేతికి అందిస్తే అమ్మాయికి సమ్మతమని ఇలా రకరకాల కోడ్ భాషలను కాబోయే వధూవరులకు రహస్యంగా ఉపదేశిస్తారు. ఇరు హృదయాలను కలిపే అద్భుత శక్తి టీకి ఉందని కాబోలు.. ఓ ప్రముఖ చాయ్‌పత్త సంస్థ ‘చక్కటి అనుబంధానికి చిక్కటి టీ’ ట్యాగ్‌లైన్‌తో విపణిలో దశాబ్దాలుగా దూసుకుపోతున్నది.
లెమన్ టీ:
కావాల్సినవి: టీ పొడి: పావు టీ స్పూన్, నిమ్మకాయ చెక్క (చిన్నది), పుదీనా: నాలుగు ఆకులు, తేనె: ఒక టేబుల్ స్పూన్.
తయారీ: పాత్రలో కప్పు నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టుకోవాలి. మీడియం మంట మీద నీళ్లను బాగా మరగనివ్వాలి. తర్వాత టీ పొడి వేయాలి. ఇంకాసేపు బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక గ్లాసులో తేనె వేసి, నిమ్మకాయ పిండుకోవాలి. పుదీనా ఆకులు వేసుకోవాలి. చివరగా గ్లాసులో డికాక్షన్ పోసి తేనె కరిగేలా బాగా కలుపుకొంటే రుచికరమైన లెమన్ టీ సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
టీ తాగకపోతే నేను అసలు పనిచేయలేను. తేనీరు నా హృదయాంతరాల్లో నిద్రిస్తున్న సామర్థ్యాలను తట్టి లేపుతుంది.
ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్
Read More :
Hyderabad Irani Chai | హైదరాబాదీ ప్రైడ్ ఇరానీ చాయ్ తయారీ ఎలాగో లుక్కేయండి
“ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”
“ఏది బెటర్?… బెల్లం చాయ్ or చక్కెర చాయ్
“పిల్లి, కుక్క, జిరాఫీ .. ఇలా బొమ్మలతో చేసిన టీ కప్లే ఇప్పుడు ఫ్యాషన్”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

