Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
Tea History | 1850 ప్రాంతంలో అసోం కొండల్లో ఆసమ్ తేయాకు తోటల పెంపకం మొదలైనా.. టీ రుచులు మనవారికి దగ్గరైంది మాత్రం 1930 ప్రాంతంలోనే!
Tea History | బ్రిటిష్ పాలకులు భారతీయులపై ఎన్నో పాశ్చాత్య పోకడలు రుద్దారు. ఎంత వద్దనుకున్నా మళ్లీమళ్లీ ముద్దనిపించే తేనీరు మన ‘కప్ ఆఫ్ టీ’ అయింది వారి వల్లే! 1850 ప్రాంతంలో అసోం కొండల్లో ఆసమ్ తేయాకు తోటల పెంపకం మొదలైనా.. టీ రుచులు మనవారికి దగ్గరైంది మాత్రం 1930 ప్రాంతంలోనే! భారతీయ తేయాకు విపణి విస్తరణ సంస్థ పెట్టి మరీ దేశం నలుచెరగులా తేనీటి ఘుమఘుమలు పరిచయం చేయడం మొదలుపెట్టారు బ్రిటిష్‌వాళ్లు. రైల్వేస్టేషన్లు, బడా నగరాల్లోని ప్రధాన కూడళ్లలో టీ కొట్లు పెట్టి.. ఆకట్టుకునేవాళ్లు! దారినపోయే దానయ్యలకు గ్లాసుల్లో టీ పోసి దానంగా ఇచ్చేవాళ్లు.
రైల్వే స్టేషన్లలో ప్రత్యేకమైన టీస్టాళ్లు పెట్టడం మాత్రమే కాదు, ప్రకటనలతో హోరెత్తించేవాళ్లు! ఆనాటి ఒక ప్రకటన బోర్డు ఇప్పటికీ పశ్చిమ్ బెంగాల్‌లోని దమ్‌దమ్ రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై కనిపిస్తుంది. ఆనాటి ఉచిత ఉష్ణోదక వితరణ సేవా కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోనూ నెలల తరబడి కొనసాగింది. మొదట్లో తేనీటిని నల్లమందు కన్నా భయంకరమైన మాదక ద్రవ్యంగా భావించిన మనవాళ్లు అటుగా వెళ్లాలంటేనే జంకేవారట!
రుచి చూసిన వాళ్లు మాత్రం జిహ్వ చాపల్యం చంపుకోలేక.. నిత్యకృత్యంగా ఏకాక్షరి సాధనలో తరించేవారట. కొన్ని రోజులకు చిన్నచిన్న టీ పొడి పొట్లాలను అక్కడే అణా, రెండణాలకు అమ్మడం మొదలుపెట్టారు. టీ రుచి మరిగిన ప్రేమికులు.. ఆ పొట్లాలను అతి జాగ్రత్తగా ఇంటికి కొనిపోయి, చిక్కటి బర్రె పాలతో కాచుకొని తాగేవాళ్లు. నాటి నుంచి తేనీటితో మనవారి ప్రేమాయణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది. అత్యధికంగా టీ వాడకం ఉన్న దేశాల్లో భారతావని రెండోస్థానంలో ఉన్నదంటే.. టీ మీద మనవారి మేటి ప్రేమకు సాటిలేదని రుజువైంది. ఆ ఘాటుప్రేమకు దీటుగా ఈ పూట మసాలా టీ కాచుకుందాం..
మసాలా టీ
కావలసిన పదార్థాలు
నీళ్లు: ఒకటిన్నర కప్పులు, పాలు: ఒక కప్పు, టీ పొడి: ఒక టీ స్పూన్, మసాలా పొడి: ఒక టీ స్పూన్ (ఇలాచీ, దాల్చిన చెక్క, సోంపు, లవంగాలు సమపాళ్లలో తీసుకొని, కాస్త వేయించి.. పొడిగా చేసుకోవాలి)
తయారీ విధానం..
స్టౌమీద గిన్నె ఉంచి, నీళ్లు పోసి, టీ పొడి, మసాలా పొడి వేసి బాగా మరిగించాలి. డికాక్షన్ మసిలేటప్పుడు పాలు పోసి, చక్కెర వేయాలి. టీ పొంగేంత వరకు ఉంచి స్టౌ ఆఫ్ చేయాలి. గ్లాసులో వడకట్టుకుంటే బద్ధకాన్ని వదలగొట్టే మసాలా టీ సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
ఒక కప్పు టీ తాగడం వల్ల, పరిష్కరించలేని సమస్యంటూ ఏదీ ఉండదు!
– తత్వవేత్త బెర్నార్డ్ పాల్ హెరాక్స్
Read More :
“Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- culture
- History
- tea
- Tea History
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

