Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !
Tea | అదేదో సినిమాలో హీరో కాచి వడబోసిన చాయ్‌పత్తాను ఎండబెట్టి దంతధావనంలా వాడేస్తుంటాడు. సదరు పీనాసి పాత్రను రక్తి కట్టించడానికి అలా అన్నా.. రక్తం కారేలా తగిలిన గాయాలకు టీ పొడి పట్టీ తక్షణం అడ్డుకట్ట వేస్తుంది! నమ్మశక్యంగా లేకపోయినా.. మధ్య భారతంలో జరిగిన ఒక సంఘటన టీ మహత్తును చాటి చెబుతుంది!!
Tea | అదేదో సినిమాలో హీరో కాచి వడబోసిన చాయ్‌పత్తాను ఎండబెట్టి దంతధావనంలా వాడేస్తుంటాడు. సదరు పీనాసి పాత్రను రక్తి కట్టించడానికి అలా అన్నా.. రక్తం కారేలా తగిలిన గాయాలకు టీ పొడి పట్టీ తక్షణం అడ్డుకట్ట వేస్తుంది! నమ్మశక్యంగా లేకపోయినా.. మధ్య భారతంలో జరిగిన ఒక సంఘటన టీ మహత్తును చాటి చెబుతుంది!!
దశాబ్దాల కిందట తమిళనాడుకు చెందిన యాభయ్యేండ్లు పైబడిన దంపతులు అనివార్య కారణాల వల్ల మధ్యప్రదేశ్‌కు వలస వెళ్లారు. భర్త కిరాణా దుకాణంలో గుమాస్తాగా చేరాడు. కొట్టు యజమాని మొదటి నెల జీతంతోపాటు అతనికి టీపొడి ప్యాకెట్ కూడా ఇచ్చాడు. కానీ, ఆ దంపతులిద్దరూ కాఫీ ప్రియులు. టీ రుచి ఎరుగరు. దాంతో టీపొడిని అటకెక్కించారు. కొన్నాళ్లకు ఆ కొట్టు యజమాని ఒక హత్య చేస్తుండగా గుమాస్తా కండ్లారా చూశాడు. కోర్టులో సాక్ష్యమూ చెప్పాడు. యజమానికి 14 ఏండ్ల ఖైదు పడింది. ఈయన మరో కొలువులో చేరాడు. ఏండ్లు గడిచాయి.
జైలు నుంచి విడుదలైన కొట్టు యజమాని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన పెద్దాయనను ఎలాగైనా మట్టుపెట్టాలని పథకం వేశాడు. మిఠాయిలో విషం కలిపి.. ఆ వృద్ధ దంపతులకు అందేలా చేశాడు. స్వీట్ తిన్నాడో లేదో పెద్దాయన గొంతులో మంటలు మొదలయ్యాయి. కండ్లు బైర్లు కమ్ముతున్నట్టు అనిపించింది. తనకు మృత్యువు తప్పదని భావించిన ఆయన భార్యతో చివరిగా ‘గుక్కెడు కాఫీ పెట్టివ్వమ’ని కోరాడు. అదేసమయంలో ఇంట్లో కాఫీ పొడి నిండుకుంది. చేసేది లేక అటక మీద డబ్బాలో ఉన్న టీ పొడితో చాయ్ కాచి ఇచ్చిందామె. టీ రెండు గుటకలు మింగాడో లేదో.. పెద్దాయన శరీరం తేలికైంది. విష ప్రభావం నిదానంగా తగ్గడం మొదలైంది. కప్పు ఖాళీ అయ్యేసరికి పోయిందనుకున్న ప్రాణం తిరిగొచ్చింది. ఎక్స్పైర్ అయిన సదరు టీపొడి విషతుల్యమై.. ఆ విషానికి విరుగుడు అయ్యిందన్నమాట! ఆయన సంగతి అటుంచితే.. శరీరంలోని విషతుల్యాలను శుద్ధిచేసే చేమంతి టీ రుచి చూడండి!
చేమంతి టీ
కావాల్సినవి: నీళ్లు: రెండు కప్పులు, ఎండిపోయిన గడ్డి చేమంతి రెక్కలు: రెండు టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
తయారీ: పొయ్యిమీద గిన్నెపెట్టి నీళ్లుపోయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత చేమంతి రెక్కలు వేసి మంచి రంగు వచ్చే వరకు మరిగించాలి. తర్వాత కప్పులో బెల్లం, నిమ్మరసం వేసుకొని అందులోకి తేనీటిని వడగట్టుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచడంలో చేమంతి టీ మేటిగా పనిచేస్తుంది.
‘టీ’కా తాత్పర్యం
నా మెదడులో నిక్షిప్తమై ఉన్న ఖజానా ద్వారం తెరిచే మంత్రదండం టీ!
బ్రిటిష్ రచయిత్రి ఫ్రాన్సిస్ హార్డింగ్
Read More :
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
“Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Health
- tea
- Tea History
- tea recipe
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

