Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు
Tea | ఔషధంగా జన్మించిన తేనీరు కాలక్రమంలో నిత్యావసరంగా, అత్యవసరంగా, సృజనాత్మకతకు వరంగా రూపుదిద్దుకున్నది. నానా రుచులతో, రంగులతో ప్రపంచాన్ని ఏలుతున్నది. ఇలాతలంలో ఇంతలా ఆదరణ పొందిన పానీయం గుణగణాలపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
Tea | ఔషధంగా జన్మించిన తేనీరు కాలక్రమంలో నిత్యావసరంగా, అత్యవసరంగా, సృజనాత్మకతకు వరంగా రూపుదిద్దుకున్నది. నానా రుచులతో, రంగులతో ప్రపంచాన్ని ఏలుతున్నది. ఇలాతలంలో ఇంతలా ఆదరణ పొందిన పానీయం గుణగణాలపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏకాక్షరి సేవనం వల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తరచూ పరిశోధనల సారాంశం వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. టీ సేవనంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఒకరు వెల్లడిస్తే, ఏకాక్షరి సాధకుల గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని మరో పరిశోధన నొక్కి వక్కాణిస్తుంది. తేయాకులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఆరోగ్యానికి అండగా ఉంటాయని పలు సర్వేల సారాంశం. గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఉలాంగ్ టీ ఇలా రకరకాల టీలు ఆరోగ్యాన్ని మేటిగా తీర్చిదిద్దడంలో సాయపడతాయని చెబుతున్నారు పరిశోధకులు. అలాగని సదా ఏకాక్షరి సేవలో ఉన్నా ప్రమాదమనే హెచ్చరికలూ ఉన్నాయి. ఎంత టీ ఆరాధకులు అయినా.. రోజులో నాలుగుసార్లకు మించి టీ రుచి చూడటం మంచిది కాదనే సర్వేలూ ఉన్నాయి. కాబట్టి, ఎంత ఇష్టమైనా.. కాస్త కష్టమనుకోకుండా టీని మితంగా తాగడమే సర్వదా మంచిది. అయితే, టీ ప్రేమికులు మాత్రం వీటిని అంత సీరియస్గా తీసుకోరు. శంఖుతీర్థుల ప్రజ్ఞను కొట్టిపారేస్తూ తానతందాన శాస్ర్తులు సెలవిచ్చినట్టు ‘కలహం అంటే.. ప్రణయ కలహమ’ని పరిశోధనల సారాంశాన్ని సౌమ్యంగా గ్రహించి తేనీటి సేవలో తరిస్తుంటారు.
ఉసిరి టీ
కావాల్సినవి: నీళ్లు: రెండు కప్పులు, తేనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉసిరికాయలు: రెండు, అల్లం: అర అంగుళం, దాల్చినచెక్క పొడి: చిటికెడు
తయారీ: ముందుగా ఉసిరి కాయలను కచ్చాపచ్చాగా (గింజలు తీసేయాలి) దంచుకోవాలి. అల్లం తురుముకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లుపోసి బాగా మరిగించుకోవాలి. అందులో ఉసిరికాయ ముక్కలు, అల్లం తురుము వేసి ఐదు నిమిషాలపాటు మరిగించుకోవాలి. చివరగా దాల్చినచెక్క పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్లాసులో తేనె వేసి.. అందులోకి టీని వడగట్టుకోవాలి. ఉసిరి టీ కొవ్వును కరిగిస్తుంది. జీవక్రియలను క్రమబద్ధం చేస్తుంది.
‘టీ’కా తాత్పర్యం
తేనీటిని ఆస్వాదించే సమయాన్ని.. మనతో మనం మాట్లాడుకునే అరుదైన క్షణాలుగా భావించాలి. ఈ అంతర్మథనం ఓ అందమైన మార్పునకు శ్రీకారం చుడుతుంది.
లూ ఆన్ పనూజియో, టీ బ్లాగర్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- amla Tea
- tea
- tea benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

