e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?

ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం చాలా అవసరం. అయితే, ఏ వ్యాయామం చేయాలనే సందేహాలు అనేక మందిని వేధిస్తుంటాయి. దాంతో చివరకు వ్యాయామం చేయకుండానే రోజులు గడిపేస్తుంటారు. అలాకాకుండా ఏ వ్యాయామమైనా నిత్యం అర్ధ గంట పాటు చేసినట్లయితే వివిధ వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

వాకింగ్‌, రన్నింగ్‌, జిమ్, డ్యాన్సింగ్‌.. ఇలా ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. వీటిని ఎవరు ఎలా చేయాలో తెలియక తికమకపడుతుంటాం. ఇవి అన్ని వయసుల వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అయితే, వయసు పైబడిన వారు ముఖ్యంగా బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. వాకింగ్‌, డ్యాన్సింగ్‌, బ్రెయిన్‌ హెల్త్‌పై ఇటీవల ఒక పరిశోధన నిర్వహించిన నిపుణులు నిత్యం బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మరింత ఎక్కువగా పొందవచ్చని తేల్చారు. వేగంగా నడిచే వారిలో మెదడు చాలా చురుగ్గా ఉండి బ్రెయిన్‌ సెల్స్‌ కూడా అంతే వేగంగా మరమ్మతు చేసుకుంటాయంట. నాడీకణాలను కలిపివుంచే వైట్‌ మ్యాటర్‌.. నడక అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా ఉత్పత్తి అయి మెదడును చురుకుగా ఉంచుతుందని ఫోర్ట్‌ కొలిన్స్‌లోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ పరిశోధక బృందం తేల్చింది. ఈ పరిశోధన పత్రం గత నెలలో న్యూరో ఇమేజ్‌ అనే జర్నల్‌లో అచ్చయింది.

- Advertisement -

ఆరోగ్యంగా ఉన్న దాదాపు 250 మంది వృద్ధులను తమ పరిశోధనకు ఎంచుకున్నారు. ఎరోబిక్స్‌, కాగ్నిటివ్‌ స్కిల్స్‌, డ్యాన్సింగ్‌, రన్నింగ్‌, బ్రిస్క్‌ వాకింగ్‌ వంటి వ్యాయామాలను ఆరు నెలలపాటు చేయించారు. ఏ గ్రూపు వారి మెదడులో వైట్‌ మ్యాటర్‌ ఎక్కువగా ఉత్పత్తి అవడాన్ని గుర్తించారు. ఈ వాలంటీర్లలో చాలామంది శరీరం, మనస్సులో మార్పులను శాస్త్రవేత్తలు గమనించారు. వారంలో మూడురోజుల పాటు 40 నిమిషాల బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేవారిలో వైట్‌ మ్యాటర్‌ ఎక్కువగా ఉత్పత్తి అయి వారి మెదడు చురుకుగా ఉండటం గుర్తించారు.

బ్రిస్క్‌ వాకింగ్‌ అంటే..?

బ్రిస్క్‌ వాకింగ్ చేయండి అంటూ వైద్యులు సూచించడాన్ని మనం వింటుంటాం. ఇంతకీ బ్రిస్క్‌ వాకింగ్‌ అంటే ఏంటి..? బ్రిస్క్‌ వాకింగ్‌ అంటే.. వాకింగ్‌, రన్నింగ్‌కు మధ్యస్తంగా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వేగంగా నడవడం. ఈ విధానంలో మెల్లగా నడవడంగానీ, వేగంగా పరిగెత్తడం గానీ ఉండదు. బ్రిస్క్‌ వాకింగ్‌ను అన్ని వయసుల వారు చేయవచ్చు. బ్రిస్క్‌ వాకింగ్‌తో మెదడుకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఫలితంగా మెదడుకు ఆక్సిజన్‌తోపాటు ఇతర పోషకాలు ఎక్కువగా అంది ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి.

నిత్యం 40 నిమిషాల పాటు బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం ద్వారా 150 క్యాలరీలను కరిగించుకోవచ్చు. వారం పాటు కఠినంగా చేసినట్లయితే ఒక పౌండ్‌ శరీరం బరువు తగ్గించుకునేందుకు వీలుంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే.. బ్రిస్క్‌ వాకింగ్‌ ఏ సమయంలోనైనా చేయవచ్చు. బ్రిస్క్‌ వాకింగ్‌తో మంచి నిద్ర పొందవచ్చు. గుండె సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. శరీరం బరువును తగ్గించుకోవాలనుకునే వారికి మంచి వ్యాయామం.

ఇవి కూడా చ‌ద‌వండి..

అమెరికన్‌ నేవీలో మహిళా శకం ఆరంభం

ఈసారి సెంట్రల్‌ వర్సిటీల్లో నేరుగా ప్రవేశాలు

ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!

పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి

చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ

సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్‌..! ఎందుకంటే..?

త్వరలో స్పేస్‌ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement