Current Shock | కారేపల్లి, జులై ౩1 : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం విశ్వనాధపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథపల్లికి చెందిన బొగ్గారపు సరస్వతి (53) ఇంటి రేకుల పందిరిలో కట్టిన జీ వైరు దండెంపై దుస్తులను ఆరవేసింది.
అయితే ఆరవేసిన దుస్తులను తీస్తుండగా జీ వైరుకు విద్యుత్ ప్రసారమై సరస్వతి విద్యుద్ఘాతానికి గురైంది. విద్యుత్ షాక్ తగిలిన వెంటనే ఆమె దుస్తులను గట్టిగా లాగటంతో జీ వైరు ఆమె మెడకు చుట్టుకుని తప్పించుకోలేక అక్కడే సరస్వతి కుప్పకూలింది.
ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే విద్యుత్ ప్రసరణను నిలిపి వేసి చూడగా సరస్వతి అప్పటికే మృతి చెందింది. మృతురాలికి భర్త బొగ్గారపు కిషన్ రావు, కుమారుడు ఉన్నారు.
MEO Gajjela Kanakaraju | విద్యార్థులకు జీవ వైవిధ్యం పాఠ్యాంశాలు బోధించాలి : ఎంఈఓ గజ్జెల కనకరాజు
Child laborers | బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మానస