సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయం దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొట్టడంతో మధ్యాహ్నం నగరంలోని రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.2, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.9డిగ్రీలు, గాలిలో తేమ 23శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.