బోనకల్లు :సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 2వ తేదీన ముష్టికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం, తూటికుంట్ల, 3న రావినూతల, చిన్నబీరవల్లి, పెద్దబీరవల్లి, నారాయణపురం, 4న చొప్పకట్లపాలెం, చిరునోముల, గోవిందాపురం-ఎ, ఆళ్లపాడు, 5న బోనకల్లు, గోవిందాపురం-ఎల్ గ్రామాల్లో నూతన కమిటీలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.