చింతకాని: మండల వ్యాప్తంగా పలుగ్రామాల్లోజరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆకట్టుకున్నాయి. నాగులవంచ రామాలయం కూడలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కోట్టే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కార్పొరేటర్ కూరాకుల వలరాజు పాల్గొని స్ధానిక యువతను ఉత్తేజపరచి కోద్దిసేపు ఉట్టి కోట్టారు.
జన్మాష్టమిని పురష్కరించుకోని గ్రామాల్లో చిన్నారులను చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలంకరించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచులు, యాదవసంఘం సభ్యులు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు.