PRTU | మధిర: ఉపాధ్యాయులకు ఎన్నో రాయితీలను,మెరుగైన సౌకర్యాలను కల్పించి సంఘం పిఆర్టియు అని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు అన్నారు. ఆదివారం మండలశాఖ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయ ఆవరణలో పిఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ సభ్యులు D. సాయి కృష్ణమాచార్యులు జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధ్యాయులు అనుభవిస్తున్న సౌకర్యాలు,రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ బలోపేతం లో 5 దశాబ్దాలుగా PRTU కృషి మరువలేనిదన్నారు. సంఘ నీడలో ఎన్నో సాధించుకున్నామని సంఘ స్థాపన నుండి నేటివరకు రాజకీయ పార్టీలకు అనుబంధంగా లేకుండా పాటుపడుతుందన్నారు.
కేవలం ఉపాధ్యాయ సంక్షేమమే లక్ష్యం గా పనిచేస్తూ రాష్ట్రంలో అగ్రగామి సంఘంగా PRTU నిలిచిందన్నారు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన సంఘాన్ని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లి ,ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుంటూ ,ఉపాధ్యాయ మన్ననలు పొందేలా ఈ తరం నాయకత్వం పని చేయాలని పిలుపునిచ్చారు.
Kamanpur | ఆదివరాహ స్వామి క్షేత్రంలో భక్తులు సందడి..
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు