Orphans | మధిర, ఫిబ్రవరి 26 : మధిర పట్టణంలోని ఆదరణ సేవా ఫౌండేషన్లో ఉన్న అనాథలకు ఇవాళ అన్నదానం ఏర్పాటు చేశారు. మధిర సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా మధిర సేవా సమితి కార్యదర్శి వేముల నవీన్ కుమార్-పూజిత రాణి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మధిర సేవ సమితి అధ్యక్షులు పల్లపోతుల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి మువ్వా రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి జంగా నరసింహారెడ్డి, కోశాధికారి లింగంపల్లి అప్పారావు, ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ, కస్తాల సతీష్, ప్రోగ్రాం చైర్మన్ ఎస్కే సైదా, ప్రచార కార్యదర్శులు బాణాల శంకరాచారి, ఆడిట్ కమిటీ చైర్మన్ ఏలూరు దుర్గాప్రసాద్, రంగిశెట్టి శ్రీనివాసరావు, దాచేపల్లి రాము, నంబూరి మురళి, సుగ్గల శ్రీనివాస్ గండూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆదరణ సేవా ఫౌండేషన్లో అన్నదానం ఏర్పాటు సందర్భంగా సేవా సమితి సభ్యులు నవీన్ కుమార్ దంపతులకు శాలువా కప్పి అభినందించారు.
SLBC Tunnel Mishap | చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్.. సొరంగంలోకి ఉత్తరాఖండ్ టీం
Maha shivratri | శివరాత్రి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లు
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు