MLC Tata Madhusudan | కేసీఆర్ చూపిన అభివృద్ధి మార్గంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలి.. బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
MLC Tata Madhusudan | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కామేపల్లి మండలంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తాతా మధుసూదన్ పాల్గొన్నారు. ముందుగా మండల పార్టీ ఆధ్వర్యంలో లింగాలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.
MLC Tata Madhusudan | కారేపల్లి (కామేపల్లి) ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన ఉద్యమం, చూపిన పట్టుదల, నాయకత్వం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కామేపల్లి మండలంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తాతా మధుసూదన్ పాల్గొన్నారు.
ముందుగా మండల పార్టీ ఆధ్వర్యంలో లింగాలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఆ తర్వాత తాళ్లగూడెం గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా.. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాలలో కీలక మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. కేసీఆర్ కు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన చూపిన అభివృద్ధి మార్గంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరారు.
మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలి..
రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రెండే కార్యక్రమాలు చేస్తున్నాడని.. ఒకటి ఇల్లు కూలగొట్టడం రెండు భూములు గుంజుకోవడం అన్నారు.
గ్యారెంటీల పేరిట 66 హామీలు ఇచ్చి కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఎక్కడ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఆటో డ్రైవర్లు, కౌలు రైతులు అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వ నైజం తెలియడానికి కొంత సమయమే పట్టిందన్నారు. అనంతరం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని యువత ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆంతోటి అచ్చయ్య, శెట్టి శ్రీనివాసరావు, తీరుదాల చిదంబర రావు, అజ్మీర రాజు, కేలోత్ భాస్కర్, కాట్రాల రాంబాబు, అజ్మీర రాజు నాయక్, కృష్ణ ప్రసాద్, మోహన్ రెడ్డి, శెట్టి శ్రీనివాసరావు, రామకృష్ణ, ఆరూరి ప్రసాద్, ఆగడాల నరేష్, బట్టు శంకర్, అజ్మీర దర్శిలాల్, శ్రీనివాసరావు, కారేపల్లి మండల నాయకులు సిద్ధంశెట్టి నాగయ్య, గుగులోత్ రవి, షేక్ పాషా, షేక్ సలీం, సురభి సాగర్, నోవా కేర్ సెంటర్ ప్రతినిధులు సురేష్, ఉపేందర్, రాము, అనంతారు, గణేష్, లక్ష్మయ్య, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Read Also :
KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Veenavanka | వీణవంకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

