Kangana Ranaut: నషీరుద్దీన్ షా ఓ నక్క.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కౌంటర్
Kangana Ranaut : సీజేపీ నిరసనలు.. బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. విద్యార్థులకు సెలబ్రిటీలు సపోర్టు ఇవ్వడం లేదని నషీరుద్దీన్ షా అన్నారు. ఆయన తన కామెంట్లో కుక్కలతో పోల్చారు. దానికి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. నషీరుద్దీన్ షా ఓ నక్క అని ఆమె తన పోస్టులో వెల్లడించారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు నషీరుద్దీన్ షాపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నషీరుద్దీన్ షాను నక్కతో పోల్చారు. సీజేపీ విద్యార్థుల ఉద్యమం పట్ల బాలీవుడ్ సరైన రీతిలో స్పందించలేదని కొన్ని రోజుల క్రితం నషీరుద్దీన్ షా కామెంట్ చేశారు. ఆ నిరసన ప్రదర్శనల పట్ల అనేక మంది సెలబ్రిటీలు మౌనంగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. అవసరం వచ్చినప్పుడే వాళ్లు మాట్లాడుతారని, కుక్క నోట్లో బొక్క ఉన్నప్పుడు మాట్లాడలేదని నషీరుద్దీన్ షా ఆరోపించారు. అయితే నటుడు నషీరుద్దీన్ షా వ్యాఖ్యలకు కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్లో జరుగుతున్న ఆందోళనల గురించి షా ఎందుకు మాట్లాడం లేదని ఆమె ప్రశ్నించారు.
షా వ్యాఖ్యలపై పీయూష్ మిశ్రా చేసిన వీడియోను కంగనా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో నషీరుద్దీన్ షాను నక్కతో పోల్చుతూ బీజేపీ ఎంపీ కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి దగ్గర కుక్కలాగ పడి ఉండటం నిజమే అని, నేను ఈ దేశం అన్నం తింటున్నానని, ఈ దేశ రక్షణ చూసుకుంటానని, దీని కోసం పోరాడుతానని, కానీ నషీర్ సాబ్ మాత్రం ఈ దేశంలో ఉంటూ పొరుగు దేశం కోసం పోరాడుతారని అన్నారు. నాకు తిండి పెడుతున్న దేశాన్ని నేను కాపాడుకుంటానని, దీని పట్ల గర్వంగా ఫీలవుతున్నానని, కానీ ఈ నేలపై తిండి తింటున్న నషీర్ మాత్రం పొరుగు దేశాన్ని రక్షిస్తున్నారని కంగనా రనౌత్ తన సోషల్ మీడియా పోస్టులో రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

