Donald Trump | కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడి సంతకం.. భారత్, చైనాలపై సుంకాలకు ట్రంప్‌కు ఫుల్ పవర్..!
Donald Trump | రష్యా, ఇరాన్, చైనా, భారత్ (Russia, Iran, China, India) లను ఒకేసారి దెబ్బతీసే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దాంతో రష్యా, ఇరాన్ (Russia, Iran) లపై ఆంక్షలను విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తోన్న భారత్, చైనాల (India, China) పై సుంకాల మోత మోగించేందుకు అధ్యక్షుడికి అధికారం దఖలు పడింది.
Donald Trump : రష్యా, ఇరాన్, చైనా, భారత్ (Russia, Iran, China, India) లను ఒకేసారి దెబ్బతీసే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దాంతో రష్యా, ఇరాన్ (Russia, Iran) లపై ఆంక్షలను విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తోన్న భారత్, చైనాల (India, China) పై సుంకాల మోత మోగించేందుకు అధ్యక్షుడికి అధికారం దఖలు పడింది.
‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ చట్టం-2026’ పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు బుధవారం సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గత నెలలోనే సెనెట్ ఆమోదించింది. ఇప్పుడు ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. దాంతో భారత్ (India), చైనా (China) తో సహా 10 దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ సర్కార్ భారీగా సుంకాలు విధించనుంది.
ఈ చట్టంపై ఇప్పటికే భారత్ స్పందించింది. రష్యాపై ఆంక్షలను, తమపై సుంకాలను విధిస్తే అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు ముప్పు తప్పదని భారత్ హెచ్చరించింది. అమెరికా చర్యను చైనా తిరస్కరించింది. భద్రతామండలి ఆమోదంలేని ఏ చర్యనూ ఆమోదించబోమని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ స్పష్టంచేశారు. ఈ చట్టంతో ట్రంప్‌నకు మరిన్ని అధికారాలు లభించినట్లయ్యింది.
రష్యా నాయకత్వంపై ఆంక్షలు విధించే అవకాశం దక్కింది. ఇంధన రంగంపై ఆంక్షల విధించవచ్చు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకుంటూ చమురు సరఫరాచేసే నౌకల షాడో ఫ్లీట్పైనా ఆంక్షలు విధించడానికి అధ్యక్షుడికి అధికారం దక్కుతుంది. రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేలా ఒత్తిడి తెస్తూ భారత్, చైనా వంటి దేశాలపై సుంకాల మోత మోగించే అధికారం ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

