ఖమ్మం రూరల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సభలో ఊహించని పరిణామం ఎదురైనా ఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎంపీడీవో కే శృదేవి అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బీ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోలుత ముఖ్యమంత్రి సందేశం వినిపించిన వెంటనే సీపీఎం మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్ది ఆధ్వర్యంలో పలువురు రైతు సంఘం నాయకులు, రైతులు తమ వెంట తెచ్చుకున్న ప్లే కార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. పొడియం వద్దకు వెళ్లిన నాయకులు రైతులు ఎదుర్కొంటున్నా సమస్యలను ఎక్కరువు పెట్టారు. మక్కల కొనుగోళ్లలో కొర్రీలు, సమగ్ర రుణమాఫీ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి..
Health tips | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ బరువు తగ్గించే ఫుడ్స్ మీకు చాలా అవసరం..!