Health tips | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ బరువు తగ్గించే ఫుడ్స్ మీకు చాలా అవసరం..!
Health tips | మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..? మీ జీవక్రియారేటు పూర్తిగా మందగించిందా..? డైట్ పాటించినా వెయిట్ మాత్రం కంట్రోల్ కావడం లేదా..? బరువు తగ్గడం అనేది మీకు ఓ పరిష్కారంలేని సమస్యగా మారిపోయిందా..? అయితే ఇకపై మీరు చింతించకండి. ఏదో ఒక పదార్థాన్ని కాకుండా బరువు తగ్గించే లక్షణాలున్న కొన్ని రకాల పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోండి.
Health tips : మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..? మీ జీవక్రియారేటు పూర్తిగా మందగించిందా..? డైట్ పాటించినా వెయిట్ మాత్రం కంట్రోల్ కావడం లేదా..? బరువు తగ్గడం అనేది మీకు ఓ పరిష్కారంలేని సమస్యగా మారిపోయిందా..? అయితే ఇకపై మీరు చింతించకండి. ఏదో ఒక పదార్థాన్ని కాకుండా బరువు తగ్గించే లక్షణాలున్న కొన్ని రకాల పదార్థాలను మీ డైట్లో భాగం చేసుకోండి. మీ సమస్య తప్పక పరిష్కారం అవుతుంది. మరెందుకు ఆలస్యం..? బరువు తగ్గేందుకు తోడ్పడే ఓ 8 రకాల ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కోడిగుడ్లు
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఆహారంలో కోడిగుడ్లను భాగం చేసుకోవాలి. కోడిగుడ్లలో ప్రొటీన్, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మనకు కడుపునిండిన భావన కల్పించి అతిగా తినకుండా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతాయి.
చికెన్ బ్రెస్ట్, లీన్ మీట్స్
స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్, లీన్ మీట్ (పలుచని రెడ్ మీట్) లో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో తోడ్పడుతాయి. అయితే వీటిలో టేస్టు కోసం మసాలాలు అధికంగా జోడించడం మానుకోవాలి. అధిక మసాలాల వల్ల వాటితో ప్రయోజనం లేకుండా పోతుంది.
చేపలు
చేపల్లో అత్యంత నాణ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర ముఖ్య పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైనంత తీసుకోగానే కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. దాంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అంతేగాక చేపలు, సీ ఫుడ్ తీసుకోవడం వల్ల కావాల్సినంత అయోడిన్ శరీరానికి అందుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి, జీవక్రియల నిర్వహణకు దోహదపడుతుంది.
చిక్కుళ్లు
చిక్కుళ్లు, ఉలవలు, పెసలు, బొబ్బెర్లు, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ లాంటి ఇతర లెగ్యూమ్స్ కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబర్లు, ప్రొటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి వీటిని కొద్దిగా తీసుకోగానే కడుపునిండిన భావన కలుగుతుంది. అంతేగాక వీటిలో శరీరానికి కావాల్సిన మోతాదులోనే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
ఆకు కూరలు
పాలకూర, తోట కూర లాంటి ఆకు కూరల్లో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తరచూ తీసుకుంటే శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది. మనకు కావాల్సినంత తీసుకోగానే కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దాంతో అతిగా తినకుండా ఉంటాం. ఫలితంగా బరువు తగ్గుతాం.
బ్రకోలీ, క్యాలీఫ్లవర్
బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్‌తో కడుపు నిండిన భావన కలిగి అతిగా తినకుండా ఉంటాం. దాంతో ఆటోమాటిక్‌గా బరువు తగ్గుతాం. కాబట్టి మీరు బరువు తగ్గాలంటే మీ డైట్లో బ్రకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీని భాగం చేసుకోవాలి.
దుంపలు
ఆలుగడ్డ, కందగడ్డ, మొరంగడ్డ లాంటి దుంపల్లో బరువు తగ్గడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అయితే వీటిని వేపుళ్ల రూపంలో తీసుకోవద్దు. ఉడికించి, రsోస్ట్ చేసి తీసుకోవడం ద్వారా వీటితో ప్రయోజనం ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

