Vijayawada | మధిర, జూన్ 22 : మధిర డిపో పరిధిలో గల జమలాపురం నుండి మైలవరం మీదుగా విజయవాడకు కొత్తగా ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ డి శంకర్ రావు ఆదివారం తెలిపారు.
ఈ బస్సు సర్వీస్ సోమవారం నుంచి మధిర బస్ స్టేషన్ నుంచి ఉ.06:00 గంటలకు బయలుదేరి జమలాపురం-మైలవరం మీదుగా విజయవాడకు 08:15 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరిగి విజయవాడ బస్ స్టేషన్ నుంచి ఉ.08:30 గంటలకు బయలుదేరి మైలవరం- జమలాపురం మీదుగా మధిర కు ఉ.10:45 గంటలకు వస్తుందన్నారు . మళ్లీ మధిర లో ఉ.11:00 గంటలకు బయలుదేరి అదే రూట్ లో విజయవాడ వెళ్లి అక్కడి నుండి మ.13:30 గంటలకు బయలుదేరి అదే రూట్లో సాయంత్రం 15:45 గంటలకు మధిర కు చేరుకొంటుందన్నారు.
తిరిగి మధిరలో సాయంత్రం 16:00 గంటలకు బయలుదేరి జమలాపురం – మైలవరం – మీదుగా విజయవాడకు 18:15 గంటలకు చేరుకొని తిరిగి విజయవాడలో 18:30 గంటలకు బయలుదేరి అదే రూట్లో మధిరకు 20:45 గంటలకు చేరుకుంటుందన్నారు. ప్రధానంగా జమలాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల దర్శనార్థం తెలంగాణ ఆంధ్ర ప్రాంతల భక్తులు, ఆ ప్రాంత ప్రజలు ఈ బస్ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి