Tunikaku | గుండాల, మార్చి 4 : ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వం వెంటనే తునికాకు టెండర్లు వేసి.. తక్షణమే ప్రూనింగ్ (కత్తిరింపు) పనులను చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలి సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేశారు. ఇవాళ కచనపల్లి గ్రామంలో ధర్నా నిర్వహించి ర్యాలీ చేసారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కాచనపల్లి రేంజ్ కార్యాలయం సిబ్బందికి సమర్పించడం జరిగింది.
ఈ సంవత్సరంలో తునికాకు టెండర్ల ప్రక్రియ నేటికీ పూర్తి చేయనందున ఆదివాసి ప్రాంత ప్రజలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనిట్లలో టెండర్లను పూర్తి చేసి సకాలంలో తునికాకు ప్రూనింగ్ పనులను చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, లేనియెడల తునికాకు సేకరణను ప్రభుత్వమే చేపట్టవలసినదిగా అఖిల భారత రైతు కూలి సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య మండల కార్యవర్గాలు డిమాండ్ చేశాయి.
ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు ఉపాధి..
ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకుడు పూనం రంగన్న, అటికం శేఖర్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ నాయకుడు యానగంటి రమేష్ మాట్లాడుతూ .. ప్రభుత్వం తునికాకు సేకరణ విషయంలో సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఆదివాసి ప్రాంతాల ప్రజలకు జీవనోపాధి గా ఉన్న తునికాకు సేకరణను నేటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సాకులు చెబుతుందన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసి.. ఇతర పేద ప్రజల జీవనోపాధిని లేకుండా చేస్తుందని వారు అన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి నెలలోనే టెండర్ ప్రక్రియలను ప్రారంభించి ఫిబ్రవరిలో ప్రూనింగ్ పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకునేది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే టెండర్లను పూర్తి చేయించాలని.. లేనియెడల ప్రభుత్వమే తునికాకు సేకరణను చేపట్టి ఆదివాసీ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 50 ఆకుల తునికాకు కట్టకు 5 రూపాయలు చెల్లించాలని.. ఇతర పనులకు 30 శాతాన్ని అదనంగా పెంచాలని. తునికాకు సేకరణలో ప్రమాదవశాత్తు మరణిస్తే 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పాక్షికంగా దెబ్బలు తలిగితే 2లక్షలు చెల్లించాలని.. తునికాకు కార్మికులకు పెండింగ్ బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పూనెం సత్యం, కటికం రమేష్, శివరాత్రి మల్లయ్య, ఓర్సు వెంకన్న, సంపంగి సంపత్, పరశురాములు, పూనం రమేష్, కల్తీ లక్ష్మయ్య , కుంజా లక్ష్మీనారాయణ, కుంజా కృష్ణ, సంపంగి ఎల్లయ్య. పూనమ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు