ఎర్రుపాలెం, ఆగస్ట్ 31: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలు మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన మిద్దె మేరమ్మ (63) గా గుర్తించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతురాలికి వివాహితులైన ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
MOVIE MAKERS | వేతనాలు పెంచిన ఫిల్మ్ ఛాంబర్.. సినీ కార్మికులకి ఎంత పెంచారంటే..!
Delhi | గిఫ్టుల పంచాయితీ.. కత్తెరతో భార్య, అత్తను చంపేశాడు
Salman Nizar | 12 బంతుల్లో 11 సిక్సర్లు.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన చిచ్చరపిడుగు..!