Salman Nizar : ఫార్మాట్ ఏదైనా యువ క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. బౌలర్లను వణికిస్తూ సిక్సర్ల మోతతో విరుచుకుపడూ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నారు. తాజాగా కేరళ క్రికెట్ లీగ్ (Kerala Cricket League)లో సల్మాన్ నిజార్ (Salman Nizar) తనదైన విధ్వంసక బ్యాటింగ్‌తో ఔరా అనిపించాడు. ఎదుర్కొన్న 12 బంతుల్లో 11 సిక్సర్లు బాదేశాడు. కాలికట్ గ్లోబ్‌స్టార్స్ కెప్టెన్ అయిన సల్మాన్ తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఊచకోతను తలపించిన అతడి బ్యాటింగ్ వీడియో నెట్టింట వైరలవుతోంది.
కాలికట్ గ్లోబ్ స్టార్స్ సారథి అయిన సల్మాన్ నిజార్ శనివారం కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన జట్టును గెలిపించాడు. 14వ ఓవర్లో అతడు క్రీజులోకి వచ్చే సరికి కాలికట్ టీమ్ స్కోర్.. 76/4. కీలక వికెట్లు పడిన వేళ సల్మాన్ టాప్ గేర్ ఆటతో చెలరేగాడు. డెత్ ఓవర్లో వీరంగం సృష్టించిన అతడు.. 12 బంతుల్లో 11 సిక్సర్లు బాదాడు.
One man. One over. Five rockets launched into orbit. 🚀
Salman Nizar just turned the 19th into a massacre!#KCLSeason2 #KCL2025 pic.twitter.com/up2rGcTdqU— Kerala Cricket League (@KCL_t20) August 30, 2025
ఐపీఎల్ పేసర్ బసిల్ థంపి వేసిన 19వ ఓవర్లో అతడు వరుసగా ఐదు బంతుల్ని స్టాండ్‌లోకి పంపాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన అతడు.. ఒక నో బాల్, ఒక వైడ్‌తో కలిపి 40 రన్స్ పిండుకున్నాడు. అతడి అసాధారణమైన బ్యాటింగ్‌తో కాలికట్ గ్లోబ్‌స్టర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తక్కువ స్కోర్‌కే ప్రత్యర్థిని నిలువరించారు. అదానీ జట్టు బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడిన సల్మాన్ వచ్చే సీజన్ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడం ఖాయమనిపిస్తోంది.
The final over was pure annihilation! Salman rewrote the final over with six brutal signatures. 🖋️💣#KCLSeason2 #KCL2025 pic.twitter.com/gVYjHxhp3H
— Kerala Cricket League (@KCL_t20) August 30, 2025