హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్‌రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం షోకాజ్ నోటీసు జారీచేసింది. ఇటీవల మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగించారని, అకడికి రోహిత్‌రెడ్డి హాజరయ్యారని వచ్చిన వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తుండగా, పార్టీపరంగా కూడా చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశమైం ది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను ఏమాత్రం సహించబోమని, నోటీసు అందిన ఏడు రోజుల్లోపు ఆరోపణలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ నోటీసులో ఆదేశించారు.
వివరణ ఇచ్చి, ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడే వరకు రోహిత్‌రెడ్డి ఎలాంటి పార్టీ అధికారిక కార్యక్రమాలు లేదా సమావేశాల్లో పాల్గొనకూడదని సూచించారు. ‘బీఆర్ఎస్ పార్టీ చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నది. మాదకద్రవ్యాల వంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండటాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని నోటీసులో పేర్కొన్నారు. గడువులోగా సమాధా నం రాకపోతే, ముందస్తు నోటీసు లేకుండానే చర్యలుంటాయని పార్టీ హెచ్చరించింది.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మొయినాబాద్ కేసులో దర్యాప్తునకు 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్‌బాబు పర్యవేక్షణలో ఈ బృం దం దర్యాప్తు చేయనున్నది. సిట్‌లో యోగేశ్ గౌతమ్ ఐపీఎస్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్‌రెడ్డి, డీసీపీ షాద్‌నగర్ శిరీష, ఈగల్ డీఎస్పీలు హరీశ్చంద్రారెడ్డి, బుచ్చ య్య, మొయినాబాద్ ఎస్హెచ్ఓ మల్లికార్జునరెడ్డి, మోకిల ఎస్సై కోటేశ్వర్రావు, మొయినాబాద్ ఎస్ఐ వెంకన్న, శంషాబాద్ రూరల్ ఎస్సై సాదత్ అలీ ఉన్నారు. మూడు నెలల్లో దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.