Corn Crop Farmers | బోనకల్, ఫిబ్రవరి 22 : శనివారం బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో గల మొక్కజొన్న (Corn Crop) నీటి ఎద్దడిని ఇవాళ క్షేత్రస్థాయిలో ఆత్మ కమిటీ మధిర నియోజకవర్గ డైరెక్టర్ కందుల పాపారావు ఏఈఓ బంధం రజిత పరిశీలించారు. వారబందీ ప్రకారము రెండు రోజుల్లో సాగునీరు బంద్ చేస్తే ఎలా… మరో నాలుగు రోజులు నీటి సరఫరా పొడిగించాలంటూ రైతులు వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…శుక్రవారం రాత్రి నుండి సాగర్ నీళ్లు రెవెన్యూ పరిధిలోకి రావడం జరిగిందని మరొక రెండు రోజులు మాత్రమే నీళ్లు వస్తాయని అధికారులు తెలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ రెండు రోజులు నీళ్లు వస్తే పంట పొలాలు అన్ని తడవవు కాబట్టి మరొక రెండు మూడు రోజులు నీళ్లు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎన్ఎస్పీ అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి మరొక రెండు మూడు రోజుల నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి