KTR | సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేను మాట్లాడే ముందు పత్రికా మిత్రులొచ్చారు. అన్నా మాకు కూడా ఓ సమస్య ఉంది. మీరు ప్రస్తావించాలి అన్నారు. పత్రికలను చూసే మంత్రి ఐ అండ్ పీఆర్ మినిస్టర్ది సత్తుపల్లి నియోజకవర్గమే కదా .. మరి వారికేం సమస్య ఉంటదనుకున్నా. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన విలేకరు సోదరులను కూడా సతాయిస్తోందన్నారు.
మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు నియోజకవర్గ స్థాయిలో పనిచేసే రిపోర్టర్లు ఎవరైతే ఉంటారో వారి హోదాను గుర్తిస్తూ.. మీరు తాలూకా స్థాయిలో పనిచేస్తున్న పత్రికా సోదరులుగా గుర్తించి గౌరవించి వారికి కార్డులు ఇచ్చేది. కానీ ఇవాళ వాళ్ల స్థాయిని కూడా తగ్గిస్తూ వాళ్లను మండల విలేకరులుగా గుర్తిస్తూ సత్తుపల్లి కేంద్రంగా పనిచేస్తున్న మా విలేకర్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్నారు.
అన్నమంతా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలని అంటరు కదా.. అట్లా ఇవాళ చివరికి విలేకరులను కూడా వదలిపెట్టకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఐ అండ్ పీఆర్ మంత్రికి నేను సత్తుపల్లి వేదికగా విజ్ఞప్తిచేస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా విలేకరులు బాధపడుతున్నరు. దయచేసి వారి స్థాయికి, గౌరవానికి తగిన విధంగా మీరు కూడా వ్యవహరించాలని.. గతంలో ప్రభుత్వం ఎట్లా అయితే బాధ్యతగా గౌరవంగా చూసుకునేదో మళ్లీ మీరు కూడా అట్లాగే చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ వారు వినిపించుకోని పక్షంలో తప్పకుండా వారిపై హైదరాబాద్లో కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నానని కేటీఆర్ భరోసానిచ్చారు.
LIVE : సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంhttps://t.co/5CjHhTKmeQ
— BRS Party (@BRSparty) June 24, 2026