MLC Dasoju Shravan kumar | డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసే మెకానిజం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
MLC Dasoju Shravan kumar | ‘ఒక వ్యక్తి –ఒక ఓటు’ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేసి, ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించి తొలగించాలని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. బీఆర్ఎస్ నాయకులు బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డిని కలిశారు.
MLC Dasoju Shravan kumar | బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ప్రత్యేక సవివర ఓటరు జాబితా సవరణ (SIR)పై ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకుడు కురువ విజయ్ సీఈవో సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ‘ఒక వ్యక్తి –ఒక ఓటు’ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేసి, ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించి తొలగించాలని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు.
అనంతరం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పునాదులను విధ్వంసం చేసేటటువంటిది.. రాజ్యాంగ స్ఫూర్తిని సర్వనాశనం చేసేటటువంటిది. పవిత్రమైన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా భ్రష్ణు పట్టించే ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లు అని అన్నారు. ఈ బోగస్ ఓటర్లు, డూప్లికేట్ఓటర్ల వల్ల పవిత్రమైన ప్రజాస్వామ్య యుత ఎన్నికల ప్రక్రియను సర్వనాశనం చేస్తున్నారో దాన్ని సరిదిద్దడం కోసమే మేం ముందుకొచ్చామని కేంద్ర ఎన్నికల సంఘం పలు మార్లు చెబుతూ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను మనముందుకు తీసుకొచ్చింది.
కేసీఆర్, బీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీలు ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వామ్యులవుతున్నారు. అయితే దీంట్లో కొలిక్కిరాని అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. బోగస్ ఓట్ల విషయంలో మేం గతంలో జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగినప్పుడు చెప్పినం. నిన్న కూడా చెప్పినం. ఇవాళ కూడా చెప్తున్నం. వివిధ రాష్ట్రాల్లో వ్యక్తులకు సంబంధించిన డూప్లికేట్ ఓట్లను డిలీట్ చేసే మెకానిజం ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర లేదు. ఇది పూర్తిగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను నష్టపరిచేది.. భ్రష్ణు పరిచేదే. ఈ విషయాన్ని కేసీఆర్ ఆదేశాల మేరకు చీఫ్ ఎలక్రోరల్ ఆఫీసర్‌కు బీఆర్ఎస్ తరపున మేం విజ్ఞప్తి చేశామన్నారు.
BRK భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు
ప్రత్యేక సవివర ఓటరు జాబితా సవరణ (SIR)పై వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్సీ @sravandasoju, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ @karne_prabhakar మరియు బీఆర్ఎస్ నాయకులు… pic.twitter.com/V2PigLLfGf
— BRS Party (@BRSparty) June 24, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

