Vitamin C | విటమిన్ సి అధికంగా ఉంటే వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా పనిచేస్తుంది.. అధ్యయనంలో వెల్లడి..
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కొన్ని పోషకాలు ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఐరన్ శోషణకు సహాయపడటం వంటి ప్రయోజనాలతో ప్రసిద్ధి చెందిన విటమిన్ సి ఇప్పుడు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని తాజా పరిశోధన వెల్లడించింది.
Vitamin C | ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కొన్ని పోషకాలు ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఐరన్ శోషణకు సహాయపడటం వంటి ప్రయోజనాలతో ప్రసిద్ధి చెందిన విటమిన్ సి ఇప్పుడు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని తాజా పరిశోధన వెల్లడించింది. రక్తంలో విటమిన్ సి స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో మెదడు నిర్మాణం మరింత ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. జపాన్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 64 సంవత్సరాల పైబడిన 2,044 మంది వృద్ధులపై పరిశోధనలు చేపట్టారు. పాల్గొన్న వారి రక్తంలో విటమిన్ సి స్థాయిలను కొలవడంతోపాటు అధిక నాణ్యత కలిగిన ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా మెదడు నిర్మాణాన్ని పరిశీలించారు. వయస్సు, లింగం, రక్తపోటు, మధుమేహం, ధూమపానం, వ్యాయామం వంటి ఇతర అంశాల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ చేపట్టారు.
పెరిగిన గ్రే మ్యాటర్..
పరిశోధనలో రక్తంలో విటమిన్ సి స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో గ్రే మ్యాటర్ పరిమాణం కూడా అధికంగా ఉన్నట్లు తేలింది. గ్రే మ్యాటర్ అంటే జ్ఞాపకశక్తి, సమాచార ప్రాసెసింగ్, నిర్ణయాలు తీసుకోవడం వంటి కీలక మెదడు కార్యకలాపాలను నిర్వహించే భాగం. విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉన్నవారిలో ఈ భాగం పరిమాణం తగ్గినట్లు గుర్తించారు. అలాగే మెదడులోని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ (డీఎంఎన్) అనే కీలక నాడీ వ్యవస్థతో విటమిన్ సి కి సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేటప్పుడు లేదా ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు ఈ నెట్వర్క్ చురుకుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రారంభ దశల్లో ఈ నెట్వర్క్ బలహీనపడటం సాధారణం. అయితే విటమిన్ సి స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో ఈ నెట్‌వర్క్‌లోని అనుసంధానాలు మరింత బలంగా ఉన్నట్లు ఎంఆర్ఐ స్కాన్లు చూపించాయి.
మెదడు ఆరోగ్యానికి మేలు..
రక్తపోటు, మధుమేహం, ధూమపానం లేదా శారీరక వ్యాయామం లేకపోవడం వంటి ప్రమాదకర అంశాలు ఉన్నప్పటికీ, విటమిన్ సి స్థాయిలు ఎక్కువగా ఉండటం మెదడు ఆరోగ్యానికి స్వతంత్రంగా ప్రయోజనం చేకూర్చినట్లు అధ్యయనం వెల్లడించింది. అంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా, తగిన స్థాయిలో విటమిన్ సి ఉండటం మెదడు నిర్మాణాన్ని సంరక్షించడంలో సహాయపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. విటమిన్ సి ప్రభావం పరిమిత స్థాయిలో ఉన్నప్పటికీ, మెదడు క్షీణతను తగ్గించడంలో దీని పాత్ర రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కలిగించే ప్రతికూల ప్రభావాలకు సమానంగా ఉంటుంది.
ఇతర అంశాలు కూడా కీలకమే..
అయితే మెదడు ఆరోగ్యం కేవలం ఒకే పోషకంపై ఆధారపడదని, నాణ్యమైన నిద్ర, క్రమమైన వ్యాయామం, ధూమపానం నివారణ, సమతుల్య ఆహారం వంటి జీవనశైలి అంశాలు కూడా సమానంగా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మెదడు కణాలను ఆక్సిడేటివ్ నష్టాల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయలు, జామపండ్లు, కివీ, స్ట్రాబెర్రీలు, క్యాప్సికం, బ్రోకోలీ వంటి ఆహార పదార్థాల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా వయస్సు పెరిగే కొద్దీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు మెరుగుపడతాయని పరిశోధన సూచిస్తోంది. రోజువారీ ఆహారపు అలవాట్లు మెదడు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో కూడా మెదడు పనితీరును మెరుగ్గా సంరక్షించుకునే అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Vitamin C
RELATED ARTICLES
తాజా వార్తలు
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

