Labourers | మధిర: ఇటీవల కూలీ పనుల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. మధిర పట్టణ సమీపంలో గల గ్రామీణ ప్రాంతాలలో రైతులు సాగు చేసిన మిర్చి కాయలను కోసేందుకు వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో కూలీలు వారి అవసరాల కోసం కిరాణా షాపుల వద్దకు సరుకులు కొనుగోలు చేసుకుంటున్నారు.
ఆ కుటుంబాలకు చెందిన మహిళలుచ చిన్నారులు చిరిగిపోయిన బట్టలను చూసిన మధిర ఆశ మిత్ర ఆరోగ్య పరివేక్షకులు లంకా కొండయ్య వారి పరిస్థితులను ఆదివారం అడిగి తెలుసుకున్నారు. లంకా సేవా ఫౌండేషన్ ద్వారా నడుపుతున్న మహాత్మాగాంధీ ఉచిత పాత బట్టల కేంద్రం ద్వారా కొండయ్య గృహ ప్రాంగణంలో మధ్య ప్రదేశ్ నుండి వచ్చిన కూలీలకు 50 కుటుంబాలకు సరిపడా పాత వస్త్రాలు కొండయ్య చేతుల మీదుగా వారికీ అందజేశారు.
ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ.. వీరు నిరుపేద గిరిజన గోత్తి కోయ కుటుంబాల వారు మధ్య ప్రదేశ్ నుండి మధిర వచ్చారని.. మధిరతో పాటు ఎర్రుపాలెం మండలం లో గల గ్రామాల్లో రైతులకు మిర్చి కూలీ లు చేసుకుంటున్నారని తెలిపారు. వారికి కావలసిన బట్టలను అందజేసినట్టు తెలిపారు.
CM Revanth Reddy | బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి : ఎంఎం గౌడ్
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు