అచ్చంపేట, ఫిబ్రవరి 9: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీల రిజర్వేషన్లు తగ్గించి మోసం చేశారని, కులగణన మొదటిసారి జరగలేదని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎంఎం గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలలో అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టి హామీని తుంగల్లో తొక్కారని విమర్శించారు. ఉన్న రిజర్వేషన్లను తగ్గించారని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన బీసీ గణన పచ్చి మోసంతో ఉన్నదని బీసీలందరూ వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీసీల గొంతును నొక్కే ప్రయత్నం ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, బీసీలను ప్రభుత్వం అనగదొక్కలని చూస్తే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని, పూర్తిస్థాయిలో బీసీ గణన మరోసారి చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.