KCR | చండ్రుగొండ, మార్చి 6 : రైతుల కోసం తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు జలాలు ఉమ్మడి జిల్లాకు చేరిన సందర్భంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదారమ్మ వచ్చిన వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం, బెండలపాడు గ్రామ శివారులోని సీతారామ కాలువ వద్ద కేసీఆర్ చిత్రపటానికి ఇవాళ గోదావరి జలాలతో జలాభిషేకం, అనంతరం పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రైతులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. రైతుల ఆకాంక్ష మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించాలనే ఉన్నత లక్ష్యంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మించాడన్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొనకండ్ల వెంకటరెడ్డి, ధారా బాబు, సంఘొండి రాఘవులు, నరుకుల్ల సత్యనారాయణ, నల్లమోతు వెంకటనారాయణ, భూపతి ధనలక్ష్మి, మేడా మోహన్ రావు, కుంజ సావిత్రి, సూరా వెంకటేశ్వరరావు, కళ్లెం వెంకటేశ్వర్లు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, బాదుషా యాకుబలి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న తెలంగాణ సాధకుడు, రైతుల పక్షపాతి కేసీఆర్ కల నిజమైంది.
గోదావరి నదీ జలాలను నాగార్జున సాగర్ కాలువకు అనుసంధానం చేస్తూ గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు వచ్చాయి. కృష్ణమ్మతో… pic.twitter.com/yeH57WWZog
— BRS Party (@BRSparty) March 5, 2025
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?