Banothu Madanlal | కారేపల్లి, ఫిబ్రవరి 23 : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేననని ఆ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యుడు బానోతు మదన్‌లాల్ జోష్యం చెప్పారు. మండల పరిధిలోని కారేపల్లి, గేట్ రేలకాయలపల్లి, అప్పాయి గూడెం, మోట్ల గూడెం గ్రామాలలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదన్ లాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పదేళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. హంగు, ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన పథకాలు అర్హత కలిగిన ప్రజలకు పూర్తిస్థాయిలో లబ్దిని చేకూర్చలేక పోయారని ఎద్దేవా చేశారు. ఏడాది పాటు కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు తిరిగి మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే అందుకు నాంది పలకాలన్నారు. ప్రతీ నాయకుడు, కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామాలలో తిరిగి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, ఉద్యమ నాయకుడు జడల వెంకటేశ్వర్లు, నాయకులు హచు నాయక్, సాగబోయిన సతీష్, వీరబాబు, జుంకీలాల్, శంకర్, నాగరాజు, జడల కళ్యాణ్, ధరావత్ వికాస్, రామారావు, భూక్య మధు, గనితి సత్యం, ముత్యాలరావు, ముక్తి కోటేశ్వరరావు, బొల్లి అప్పారావు, వాంకుడోత్ పూర్ణ, భూక్య కోటేష్, శ్రీకాంత్, సతీష్,ఉపేందర్,రాకేష్, రామనాథం, బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్‌లో గృహిణి ఆత్మహత్య