అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ (Group-2 Mains) పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. అభ్యర్థుల విన్నపాల మేరకు పరీక్షలను కొన్నిరోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖను అందజేసింది. అయితే పరీక్షలు వాయిదా వేస్తే ఏపీలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల కోడ్ను (MLC Election Code) ఉల్లంఘించినట్లవుతుందని ఏపీపీఎస్సీ ( APPSC ) స్పష్టం చేయడంతో ఆదివారం ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను గట్టి పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు.