Woman Suicide | ఉప్పల్, ఫిబ్రవరి 23 : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్‌లోని కామాక్షిపురంలో ఆకుల మనీషా(24) అనే గృహిణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రామంతపూర్‌లో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. గౌడ కులానికి చెందిన మనీషా, ముదిరాజ్ కులానికి చెందిన సంపత్తో సంవత్సరం క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరు సూర్యాపేట జిల్లాకు చెందిన వారు కాగా, బతుకుదెరువు కోసం రామంతపూర్‌కి వచ్చి ఉంటున్నారు. సంపత్ నిలోపర్ హాస్పిటల్లో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా మనీషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.