Gurukul Entrance Test | ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి (Gurukul Entrance Test) 23వ తేదీ (నేడు)ఆదివారం ప్రవేశ పరీక్ష ఉన్న సంగతి తెలిసిందే. కాగా జిల్లా కేంద్రం గద్వాలలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలో జిల్లాలోని మానవపాడు మండలానికి చెందిన జి భార్గవి అనే విద్యార్థినిని పరీక్ష రాయడానికి అధికారులు అనుమతి నిరాకరించారు.
ఆ విద్యార్థినికి హాల్ టికెట్ ఉన్నా కూడా.. తమ జాబితాలో పేరు లేదనే కారణంతో పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం బయటనే ఉండిపోయింది. మరో విషయం ఏమంటే.. ఈ విద్యార్థినికి సంబంధించి.. ఆదాయ ధ్రువీకరణ పత్రంలో ఆదాయం రూ.12,50,000 లుగా ఉంది. ఈ కారణంతో భార్గవిని జాబితాలో నుంచి తొలగించినట్లుగా భావిస్తున్నారు.
హాల్ టికెట్ డౌన్లోడ్ అయినా కూడా ఆ విద్యార్థిని పరీక్ష రాయించకపోవడాన్ని అధికారుల తప్పిదంగా భావిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని భార్గవి తండ్రి వెంకటేష్ కోరుతున్నాడు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి