Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 8 : ఒక వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలు కసరత్తు జరుగుతున్న ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు.. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలో ఏడు పంచాయతీలు కలడంతో ఈ ఎన్నికలు అధికారులకు సవాల్ గా మారాయి.
ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు..
కార్పొరేషన్ మాట అటుంటే పరిషత్ ఎన్నికలకు అన్నీ లైన్ క్లియర్ చేసేందుకు అధికారులు సిద్దం అయ్యారు.. ఇప్పటికే భద్రాచలం మండలం కావడంతో అక్కడ ఓటర్లతోపాటు సుజాత నగర్ లో పాత ఎంపీటీసీల స్థానాలు లెక్క ఎప్పటి లాగానే చూపించారు.. పాత లెక్కల ప్రకారం ఎంపీటీసీలు ఉంటే కార్పొరేషన్ ఏమైనట్టు అని అందరినీ ఆలోచనలో పడేసిన ప్రశ్న తొలిచేస్తోంది.
కార్పొరేషన్ పరిధి ఎంత వరకు..
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి ఎంత వరకు అని అందరిలో సందేహాలు వస్తున్నాయి.. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లో ఏడు పంచాయతీలు కలిపి కార్పొరేషన్ అనేది స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాట… తాజాగా పత్రికా ప్రకటన కూడా చేసారు.. మరి అధికారులు ఆ ఏడు పంచాయతీలను వదల కుండా ఎంపీటీసీ స్థానాలు ఎట్లా చేసారు అనేది సర్వత్రా చర్చ…ఇంతకీ ఎన్నికల సమయానికి ఎంపీటీసీలు, పంచాయతీలు తగ్గించి ఎన్నికలు పెడతారా..? లేక కార్పొరేషన్ లో పంచాయతీలు తగ్గిస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం.
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
Sabitha Indra Reddy | మహేశ్వరం అభివృద్ధికి పైసా ఇవ్వని సీఎం రేవంత్..: మాజీ మంత్రి సబిత
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా