నమస్తే తెలంగాణ ముదిగొండ ఫిబ్రవరి 21: మండలంలో(Mudigonda) ట్రాక్టర్ బ్యాటరీల((Tractor batteries)) దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో మాటు వేసి దొంగతనానికి పాల్పడుతున్నారు. మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న సువర్ణపురం గ్రామంలో గురువారం రాత్రి ఓ ట్రాక్టర్ బ్యాటరీ చోరీకి గురైంది. గ్రామంలో వారం రోజుల్లోనే మూడు ట్రాక్టర్ల బ్యాటరీలు గత నెల రోజులుగా పది ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. అంటే దొంగలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు అర్థమవుతుంది.
ఉదయం వేళల్లో రెక్కీ చేస్తున్న దొంగలు రాత్రి వేళల్లో దొంగతనం చేస్తున్నారు. ట్రాక్టర్ల బ్యాటరీలు ఒక్కొక్కటి సుమారు రూ.45,000 ఉంటాయని బాధితులు వాపోతున్నారు. ఈ గ్రామంలోనే కాకుండా మండలంలో మరికొన్ని గ్రామాల్లో కూడా ఇలానే చోరీకి గురైనట్లు తెలుస్తోంది. పోలీసుల గస్తీ పెంచి చోరీలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Elon Musk | భార్యతో జెలెన్స్కీ ఫొటోషూట్.. పిల్లలు చనిపోతుంటే ఇవేం పనులు అంటూ మస్క్ ఫైర్
Daaku Maharaaj OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Salman Khan | హాలీవుడ్ చిత్రం.. ఆటో డ్రైవర్గా సల్మాన్ ఖాన్.. వైరలవుతున్న వీడియో