Elon Musk | ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelensky)పై టెస్లా బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2022లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో జెలెన్స్కీ తన భార్యతో కలిసి వోగ్ ఫొటో షూట్ (Vogue Shoot)లో పాల్గొనడమే మస్క్ ఆగ్రహానికి కారణమైంది. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటూ అవేవీ పట్టనట్టు భార్యతో ఫొటో షూట్లో పాల్గొనడమేంటి..? అంటూ ప్రశ్నించారు.
Elon Musk2
కాగా, గత మూడేళ్లుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకా.. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యా-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ శాంతి చర్చల వేళ.. గతంలో జెలెన్స్కీ ఫొటో షూట్లో పాల్గొన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రష్యాతో యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే భార్యతో కలిసి ఫొటో షూట్ చేస్తారా..? అంటూ మండిపడ్డారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవేం పనులు అంటూ జెలెన్స్కీపై విరుచుకుపడ్డారు.
Elon Musk3
కాగా, 2022లో జెలెన్స్కీ, తన భార్య, ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కాతో కలిసి వోగ్ ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ తీశారు. ‘పోర్ట్రెయిట్ ఆఫ్ బ్రేవరీ : ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా’ శీర్షికతో దీన్ని ప్రచురించారు. యుద్ధ సమయంలో ఉక్రేనియన్ ప్రజల స్థితిస్థాపకత, దృఢ సంకల్పాన్సి హైలెట్ చేసే ఉద్దేశంతో దీన్ని ప్రచురించారు. అయితే, ఫొటోషూట్ జరిపిన సమయం, సందర్భం సరైంది కాకపోవడంతో దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఫొటో షూట్‌పై గతంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు మానవతా దృక్పథంతో తాము సాయం చేస్తుంటే.. జెలెన్స్కీ మాత్రం తమను పిచ్చోళ్లను చేస్తున్నాడంటూ విమర్శించారు. ఇప్పుడు శాంతి చర్చల వేళఫొటోషూట్ అంశం వివాదాస్పదంగా మారింది.
He did this while kids are dying in trenches on the war front pic.twitter.com/NPhDz3cP46
— Elon Musk (@elonmusk) February 20, 2025
Also Read..
Kashyap Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్
Israel: ఇజ్రాయిల్‌లో ఉగ్రదాడి.. మూడు బస్సుల్లో పేలుళ్లు