టెల్ అవివ్: ఇజ్రాయిల్‌లోని టెల్ అవివ్ సమీపంలోని బాట్ యామ్‌లో మూడు బస్సుల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు దాడి చేసి ఉంటారని ఇజ్రాయిల్ పోలీసులు అనుమానిస్తున్నారు. మరో రెండు బస్సుల్లో అమర్చిన బాంబులు పేలలేదని అధికారులు చెప్పారు. అనుమానితుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. దేశవ్యాప్తంగా అన్ని బస్సులు, రైళ్లను ఆపేశామని రవాణాశాఖ మంత్రి మిరి రిగెవ్ తెలిపారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించిన తర్వాతే వాటిని పంపనున్నట్లు పేర్కొన్నారు.
תנועת הרכבת הקלה בגוש דן נעצרה לחלוטין לבדיקה ביטחונית | העדכונים מהפיצוצים בבת יםhttps://t.co/C6OYmZlas5 pic.twitter.com/1d3ebLXHXn
— החדשות – N12 (@N12News) February 20, 2025
పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఓ బస్సుకు నిప్పు అంటుకున్న విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ పేలుళ్లలో ఎవరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియరాలేదు. టెల్ అవివ్ ప్రాంతంలో బాంబు తనిఖీలు జరుగుతున్నాయని పోలీసు శాఖ ప్రతినిధి ఆరే డోరన్ తెలిపారు. అనుమానిత బ్యాగ్ లేదా వస్తువు కనిపించినా.. పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.