Salman Khan | బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్ (Salman Khan), సంజయ్‌దత్ (Sanjay Dutt) కలిసి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఒక హాలీవుడ్ (Hollywood) ప్రాజెక్ట్ కోసం ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ ముందుకొచ్చారు. 2021లో అర్జెంటీనాలో విడుదలైన ‘సెవెన్ డాగ్స్’ రీమేక్‌లో వీరిద్దరూ ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం సౌదీ అరేబియా (Saudi Arabia)లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు చెందిన ఫస్ట్ లుక్ తాజాగా బయటకు వచ్చింది. ఆటో డ్రైవర్ (auto driver) డ్రెస్‌లో సల్మాన్ కనిపించారు. అతని పక్కనే సూట్ ధరించిన సంజయ్ దత్ నిలబడి ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Bhai and Baba are in Saudi Arabia to shoot cameo for a Hollywood movie 🎥… #Salmankhan #Sanjaydutt #Sikandar pic.twitter.com/ZoTZ6mNae4
— Adil Hashmi👁🗨 (@X4SALMAN) February 19, 2025
కాగా, భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించలేమని ఇటీవలే నిర్మాతలు తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లో జరిగే అమెరికన్ థ్రిల్లర్ కథాంశమిదని, అక్కడ సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్‌లకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా వారిద్దరిని కీలకమైన అతిథి పాత్రల్లో ఎంపిక చేశారని తెలిసింది. సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్ కలిసి గతంలో ‘సాజన్’ ‘ఛల్ మేరే భాయ్’ ‘యే హై జల్వా’ అనే చిత్రాల్లో నటించారు. గత ఏడాది ‘ఓల్డ్ మనీ’ అనే ఓ పాటలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. సల్మాన్‌ఖాన్ త్వరలో ‘సికందర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.
MEGASTAR SALMAN KHAN in Saudi Arabia today #Sikandar #SalmanKhan pic.twitter.com/pUVl8WMvoc
— Lokendra Kumar (@rasafi24365) February 19, 2025
Dashing #SalmanKhan pic.twitter.com/oaVWpUFDNc
— Ifty khan (@Iftykhan15) February 20, 2025
Also Read..
Maha Kumbh | ఐదు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా.. భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం
Heart Attack | డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఒకరు మృతి