Jitesh V Patil | భద్రాద్రి కొత్తగూడెం..ఫిబ్రవరి 13 : ఇతర రాష్ట్రాలలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దానిని వ్యాప్తిని నిరోధించేందుకు, ముందస్తు చర్యల్లో భాగంగా మన జిల్లాకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ (Jitesh V Patil) తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి కోళ్ల దిగుమతి అరికట్టేందుకు అశ్వరావుపేట, దమ్మపేట మండలం అల్లిపల్లి, చర్ల మండలం తేగడ వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ముమ్మర తనిఖీలు చేసి కోళ్లు, గుడ్ల వాహనాలు వస్తుంటే వెంటనే తిరిగి వెనక్కి పంపిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫామ్ లను నిరంతరం పర్యవేక్షించడానికి ఆర్ఆర్ టి (రాపిడ్ రెస్పాన్స్ టీం) బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ బృందాలలో డాక్టర్, హెల్పర్ ప్రతి గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లను నిరంతరం పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.
జిల్లాలోని అన్ని పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులకు వైరస్ రాకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై తగు సూచనలు ఇప్పటికే చేసి ఉన్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా కోళ్లకు ఏదైనా సమస్య ఉంటే పశుసంవర్ధక శాఖ అధికారులు లేదా డాక్టర్‌కు కు వెంటనే తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్‌లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం