Thieves | పాల్వంచ ఫిబ్రవరి 13 : పాల్వంచ పట్టణంలో దొంగలు పట్టపగలే హల్చల్ చేస్తున్నారు. గురువారం ఓ దొంగ ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చి తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురింటి వారు గమనించి అరవడంతో పారిపోయాడు. ఈ సంఘటన పట్టణంలోని రాహుల్‌గాంధీ నగర్లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు స్థానికుల వివరాల ప్రకారం… టీజీ జెన్కో యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్లో ఫైర్‌మెన్ గా ఎం.నాగేశ్వర్ రావు విధులు నిర్వహిస్తున్నాడు.
సదరు ఫైర్‌మెన్ ఇంటికి తాళాలు వేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరు లేరని తాళాలు వేసి ఉన్నదాన్ని గమనించిన దొంగ గురువారం గడ్డపారతో తీసుకొని వచ్చి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్నాడు. గడ్డపారతో తాళాలు పగలగొడుతున్న శబ్దాలు రావడంతో ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తులు అప్రమత్తమయ్యారు.. ఎదురుగా ఉన్న ఇంటికి తాళం వేసి ఉంటే శబ్దాలు ఎట్లా వస్తున్నాయని ఎదురింటి వాళ్ళు గమనించి అక్కడికి వచ్చారు. గడ్డ పలుగుతో తాళంను దొంగ పగుల కొడుతున్నాడు. వారు వెంటనే దొంగ దొంగ అని అరిచారు.. దీంతో దొంగ అప్రమత్తమై పక్కనే ఉన్న గోడ దూకి పారిపోయాడు.
సీసీ కెమెరాలు పరిశీలిస్తే..
ఈ సంఘటన జరిగిన వెంటనే ఇంటి యజమానికి ఎదురింటి వారు ఫోన్ చేసి విషయం తెలియజేశారు.. ఆ ఇంటి పక్కనే ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే దొంగ మెయిన్ రోడ్డు నుంచి ప్రస్తుతం సంఘటన జరిగిన ఇంటికి వచ్చి తాళాలు పగలగొడుతూ ఎదురింటి వారు అరవడంతో సదరు దొంగ పారిపోతున్న దృశ్యాలు సీసీ పుటేజీలో కనిపించాయి. దొంగ గోడ దూకి కాలనీ చివరి నుంచి పక్కనే ఉన్న జాతీయ రహదారి కి చేరుకొని పారిపోయినట్లుగా కూడా సీసీ పుటేజి లో కనిపించింది. దీనిపై వెంటనే పట్టణ పోలీసులకు పక్కింటి వారు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్‌లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం