భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 : రేపు(27) జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు(MLC elections) అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్ర డిగ్రీ కాలేజీలో పోలింగ్ మెటీరియల్‌ను జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ ఆధ్వర్యంలో పోలింగ్ అధికారులు మెటీరియల్‌ను తీసుకున్నారు. జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్‌ను తరలించనున్నారు. ఇందు కోసం బస్‌లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి బస్‌ల ద్వారా పోలింగ్ సిబ్బంది అయా కేంద్రాలకు చేరుకుంటారు. అలాగే అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మెటీరియల్ సరఫరా కేంద్రాన్ని సందర్శించారు.
ఇవి కూడా చదవండి..
Actor Vijay | టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుకలు.. ఒకే వేదికపై విజయ్, ప్రశాంత్ కిషోర్
Maha Shivaratri | ఉపవాసం అంటే పుణ్యం కోసం చేసేదే కాదు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసా!