Actor Vijay | తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam) చీఫ్ విజయ్ (Actor Vijay), రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఒకే వేదికపై దర్శనమిచ్చారు. విజయ్ ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించి ఏడాది పూర్తైన సందర్భంగా ఇవాళ చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీవీకే నేతలతోపాటు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.
కాగా, 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ప్రశాంత్ కిషోర్ సహకరిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే చెన్నైలో విజయ్ను ప్రశాంత్ కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు కూడా. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన విజయ్‌కి సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. దేశంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీవీకే పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తుండటంతో.. విజయ్ పార్టీపై తమిళనాట అంచనాలు పెరిగాయి. ఇక ఇవాళ సభలో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పోత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలక ప్రకటన చేయనున్నట్లు తమిళ మీడియా పేర్కొంటోంది.
మరోవైపు పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. #GETOUT అనే హ్యాష్‌ట్యాగ్‌ను చేర్చారు. #GetOutModi, #GetOutStalin హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టర్లను ఏర్పాటు చేశారు.
Also Read..
Air India | అదో చెత్త ఎయిర్‌లైన్స్.. ఎయిర్ ఇండియాకు ఆస్కార్ ఇవ్వాలి : బీజేపీ నేత
Maha Shivratri: కాశీలో శివ తాండవ స్తోత్రాన్ని పాడిన విదేశీయులు.. వీడియో
Uttar Pradesh: ఫ్రెండ్ మెడలో పూలమాల వేసిన వరుడు.. చెంప చెల్లుమనిపించిన వధువు