Air India | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎయిర్ ఇండియాపై మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో బీజేపీ నేత జైవీర్ షెర్గిల్ సైతం ఎయిర్ ఇండియా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు ‘చెత్త ఎయిర్‌లైన్స్’ (WORST AIRLINES) విభాగంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టాడు. అందులో ఎయిర్ ఇండియాలో ప్రయాణం ఆహ్లాదకరమైన అనుభవం కాదని పేర్కొన్నారు. సంస్థ అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని వ్యాఖ్యానించారు. ‘చెత్త ఎయిర్‌లైన్స్ విభాగంలో ఎయిర్ ఇండియా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విభాగంలో ఎయిర్‌లైన్స్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. విరిగిన సీట్లు, చెత్త సిబ్బంది, దయనీయమైన గ్రౌండ్ సపోర్ట్ స్టాఫ్..’ అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌పై పలువురు ఎయిర్ ఇండియా కస్టమర్లు స్పందించారు. ఈ మేరకు తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ‘నేను బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే.. విమానంలో ఎకానమీ విభాగంలో సీటు కేటాయించారు’ అంటూ ఓ కస్టమర్ పేర్కొన్నారు. మరోవైపు షెర్గిల్ పోస్ట్‌పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ మేరకు ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.
If there was an Oscar equivalent for WORST AIRLINES @airindia would win hands down in every category :
> Broken Seats
> Worst Staff
>Pathetic “on Ground” Support Staff
> Give two hoots attitude about customer service !Flying Air India is not a pleasant experience but today…
— Jaiveer Shergill (@JaiveerShergill) February 25, 2025
విరిగిపోయిన సీటు ఇచ్చారు..
విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Chouhan) శనివారం ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. ప్రయాణికుల నుంచి పూర్తి చార్జీలను వసూలు చేసి వారికి విరిగిపోయిన సీట్లను కేటాయించడాన్ని అనైతిక చర్యగా ఆయన అభివర్ణించారు. విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనికి వెంటనే ఎయిర్ ఇండియా స్పందించి మంత్రికి క్షమాపణలు చెప్పింది. ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. తన అనుభవాన్ని చౌహాన్ వివరిస్తూ పూసాలో జరగనున్న రైతుల ప్రదర్శన శాలను, ప్రారంభించి కురుక్షేత్రలో ప్రకృతి సేద్యం మిషన్ సమావేశంలో పాల్గొనేందుకు తాను భోపాల్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణించానని తెలిపారు. తనకు కేటాయించిన సీటులో కూర్చోగా అది విరిగిపోయి, కుంగిపోయి ఉండడాన్ని గమనించానని ఆయన చెప్పారు.
आज मुझे भोपाल से दिल्ली आना था, पूसा में किसान मेले का उद्घाटन, कुरुक्षेत्र में प्राकृतिक खेती मिशन की बैठक और चंडीगढ़ में किसान संगठन के माननीय प्रतिनिधियों से चर्चा करनी है।
मैंने एयर इंडिया की फ्लाइट क्रमांक AI436 में टिकिट करवाया था, मुझे सीट क्रमांक 8C आवंटित हुई। मैं जाकर…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 22, 2025
Also Read..
Samantha | అది నా ఫస్ట్ లవ్.. ఇక సినిమాలకు విరామం ఉండదు : సమంత
Chicago | రన్‌వేపై ఢీకొనబోయిన రెండు విమానాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. VIDEO