Champions Trophy | ఈ సారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కి పొరుగుదేశం పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన దాదాపు 100 మందికిపైగా పోలీసులపై (Pakistani policemen) అధికారులు వేటు వేశారు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కేటాయించిన భద్రతా విధులను నిర్వర్తించేందుకు నిరాకరించిన కారణంగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
పంజాబ్ పోలీసు (Punjab Police) అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. పలు సందర్భాల్లో వారికి కేటాయించిన విధులకు గైర్హాజరైనందుకు 100 మందికిపైగా పోలీసులను విధుల నుంచి తొలగించారు. ‘చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ (Lahore)లోని గడాఫీ స్టేడియం (Qaddafi Stadium) నుంచి జట్లు బస చేసే హోటళ్ల వరకు ఆటగాళ్ల కోసం భద్రతను కేటాయించాం. అందుకోసం పోలీసు అధికారులను నియమించాం. అయితే వారిలో కొందరు విధులకు హాజరుకాలేదు. కొందరు బాధ్యతలను స్వీకరించడానికి పూర్తిగా నిరాకరించారు. ఎవరైనా సరే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని పంజాబ్ ప్రావిన్స్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ స్పష్టం చేశారు. తొలగింపునకు గురైన వారంతా పోలీసు దళంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు తెలిసింది.
Also Read..
Champions Trophy | రేసు రసవత్తరం.. గ్రూప్- బీలో నాలుగు జట్లకూ నాకౌట్ అవకాశం!
SA Vs AUS | దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. రెండుజట్లకు ఒక్కో పాయింట్..