SA Vs AUS | దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. రెండుజట్లకు ఒక్కో పాయింట్..
SA Vs AUS | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ సైతం పడలేదు. ఇరుజట్లకు చెరొక పాయింట్ లభించనున్నది. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.
SA Vs AUS | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ సైతం పడలేదు. ఇరుజట్లకు చెరొక పాయింట్ లభించనున్నది. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లు చెరొక మ్యాచ్‌లో గెలువగా.. ఆయా జట్ల ఖాతాలో చెరో మూడు పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రికాకు ఇంగ్లాండ్‌తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియాతో తలపడనున్నది. గ్రూప్-బీలో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ చెరో మ్యాచ్ ఆడగా.. ఓడిపోయాయి. చాంపియన్స్ ట్రోఫీలోనే ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో, సౌతాఫ్రికాతో మ్యాచులు మిగిలి ఉన్నాయి.
ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు పదేపదే వర్షం కురవడంతో రద్దు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు.. ఆ తర్వాత మధ్యాహ్నం 3.10 గంటలకు పరిశీలించగా.. వర్షం కురుస్తూనే ఉంది. అయితే, కనీసం 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని భావించినా సాధ్యపడలేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లపై గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటాయి. ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు (ఫిబ్రవరి 26) జరిగే మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ ఉండగా.. ఇందులో ఓడిన జట్టు రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సెమీస్‌కు చేరాలంటే మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిందే. శుక్రవారం ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య, శనివారం దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచులు జరుగనున్నాయి. ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాలంటే రెండు మ్యాచుల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సిందే.
దక్షిణాఫ్రికా కీలక బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. మోచేయి గాయం కారణంగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు కోలుకోవడానికి ఇంకా మూడు రోజులు సమయం ఉన్నది. 2023 వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఇది మొదటి మ్యాచ్ కాగా.. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఐసీసీ ఈవెంట్స్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతున్నది. తొమ్మిది మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 4, దక్షిణాఫ్రికా మూడు మ్యాచులు గెలిచాయి. 1999 ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్ టై కాగా.. తాజాగా మ్యాచ్ వర్షార్పణమైంది. చాంపియన్స్ ట్రోఫీలోనే రెండు జట్లు మళ్లీ పోటీ పడాలంటే ఫైనల్‌కు చేరుకోవాల్సిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

