Virat Kohli | భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డేల్లో విరాట్ కంటే బెటర్ ప్లేయర్‌ను చూడలేదని పేర్కొన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండ్కూలర్ రికార్డును విరాట్ అధిగమిస్తాడని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతున్న విరాట్.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ చేశాడు. ఇది వన్డేల్లో విరాట్‌కు 51వ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం వన్డేల్లో సచిన్ రికార్డును అధిగమించేందుకు కేవలం 4వేల పరుగులు దూరంలో ఉన్నాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 14వేలు మైలురాయిని అందుకున్న మూడో ప్లేయర్ విరాట్ కాగా.. వన్డేల్లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డును నెలకొల్పాడు.
ఇంతకు ముందు టీమిండియా, శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే ఈ ఘనతను సాధించారు. కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో 14,085 పరుగులు చేయగా.. సచిన్ కంటే 4,341 పరుగులు వెనుకంజలో ఉన్నాడు. వన్డేల్లో 18,426 పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సచిన్ పేరిట ఉన్నది. ఈ ఓ కార్యక్రమంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ వన్డేల్లో విరాట్ కంటే మంచి ఆటగాడిని తాను చూడలేదని చెప్పాడు. ఇంకా పరుగులు చేయాలనే తపన కోహ్లీకి ఉందని.. అదేం అసాధ్యమైన పని కాదని చెప్పాడు. శారీరకంగా ఇంకా ఫిట్‌గా ఉన్నాడని.. ఆట కోసం కష్టపడుతున్నాడని తెలిపాడు. చాలాకాలంగా బాగానే రాణిస్తున్నాడని.. సచిన్ రికార్డును అధిగమించేందుకు ఇంకా 4వేల పరుగులు మాత్రమే చేయాలన్నాడు.
సచిన్ గొప్ప బ్యాట్స్‌మెన్ అని.. అతను సుదీర్ఘం కాలం క్రికెట్ ఆడడం వల్లే అన్ని పరుగులు చేయగలిగాడని పేర్కొన్నాడు. కోహ్లీలాంటి ఆటగాడిని విస్మరించలేరని.. అతనిలో ఇంకా పరుగులు చేయాలన్న తపన ఉందన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెస్ట్ ఇస్తాడని.. అతనో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌గా అభివర్ణించాడు. 2022 టీ20 ప్రపంచ కప్, తాజాగా పాక్‌పై రాణించాడని గుర్తు చేశాడు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. టాప్ ఆర్డర్లో విరాట్‌లాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అవసరమని చెప్పాడు. దుబాయి పిచ్‌పై విరాట్ సెంచరీ చేశాడని.. పాక్‌కు చెందిన స్టార్ ప్లేయర్స్ ఎవరూ భారీ స్కోర్ చేయకుండానే పెవిలియన్‌కు చేరారని గుర్తు చేశాడు. అయితే, ఏ ఫార్మాట్లోనైనా హాఫ్ సెంచరీ మిమ్మల్ని.. జట్టును గెలిపించదని తాను ఎప్పుడూ చెబుతూనే ఉంటానని.. తప్పనిసరిగా భారీ స్కోర్ చేయాలని చెప్పాడు.