Samantha | తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న భామల్లో స్టార్ నటి సమంత (Samantha) ఒకరు. అయితే, సామ్ గత కొంతకాలంగా గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల అనంతరం కొద్దిరోజులకే మయోసైటిస్ బారిన పడింది. దాన్నుంచి కోలుకునేందుకు సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. ఇంతలోనే తన తండ్రి జోసెఫ్ ప్రభు హఠాత్తుగా మరణించడం.. తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోవడం సామ్‌ను తీవ్రంగా బాధించాయి. వీటన్నింటి నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే.. మళ్లీ తిరిగి తన వర్క్‌లైఫ్‌లో బిజీగా మారింది. వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) వెబ్‌సిరీస్‌లో మెరిసిన సమంత.. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Brahmand) షూట్లో జాయిన్ అయింది.
ఈ నేపథ్యంలో కొంతకాలం విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడం పట్ల సమంత స్పందించారు. ఇకపై విరామం తీసుకోనని ప్రకటించారు. యాక్టింగ్ తన ఫస్ట్ లవ్ (my first love) అని పేర్కొన్నారు. ‘సినిమాలు నా మొదటి ప్రేమ. నేను ఇకపై నటనకు విరామం తీసుకోను. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చాను. తిరిగి మీ సామ్ మీ ముందుకు వరుస చిత్రాలతో వస్తుంది’ అని ప్రకటించింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత మరో చిత్రం కూడా రెండు నెలల్లో సెట్స్ మీదకు వెళ్తుందని పేర్కొంది. కాగా, విజయ్ దేవరకొండతో చివరగా ఖుషి సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ Rakt Brahmand వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది.
Also Read..
Kamal Haasan | ఇంతకంటే చెప్పొద్దు.. ఆ సినిమాలో గజదొంగ పాత్రలో నటించా: కమల్‌హాసన్
Chiranjeevi | చిరంజీవి కామెడీ సెన్స్‌కి అనిల్ కామెడీ తోడైతే.. మెగా డబుల్ కామెడీ ట్రీట్?
MAD Square | మ్యాడ్ స్వ్యేర్.. రెట్టింపు వినోదం ఖాయం